Nandyala: సోలార్ ప్లాంట్‌లో అదేపనిగా వింత అరుపులు.. కెమెరాలో కనిపించిన దృశ్యం చూడగానే..

Updated on: Aug 27, 2025 | 9:56 AM

సోలార్ ప్లాంట్లో పని చేస్తోన్న సిబ్బందికి ఒక్కసారిగా ఎక్కడ నుంచో చప్పుళ్లు వినిపించాయి. అదేంటి అని.? ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్ లో వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. అదేంటంటే.. ఈ స్టోరీలో చూసేయండి.

నంద్యాల జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానిక పాణ్యం మండలం కందికాయపల్లె సోలార్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం చేస్తోంది. మంగళవారం సాయంత్రం సోలార్ ప్లాంట్‌లో చిరుత సంచారం చేయగా.. ప్లాంట్ సీసీటీవీ కెమెరాల్లో ఆ దృశ్యాలు అన్ని రికార్డు అయ్యాయి. దీంతో సోలార్ ప్లాంట్ సిబ్బంది.. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు ఇటీవల శ్రీశైలంలోని జనావాసాల్లో కూడా చిరుత సంచరించడంతో.. యాత్రికులు, స్థానికులు భయపడుతున్నారు. త్వరతగిన చిరుతను అటవీశాఖ సిబ్బంది బంధించాలని కోరుతున్నారు.