Guntur: అర్ధరాత్రి ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోయింది.. డౌట్ వచ్చి ప్రయాణీకులు లేచి చూడగా.. అమ్మబాబోయ్
పల్నాడు జిల్లాలోకి ట్రైన్ ఒక్కసారిగా ఎంటర్ అయింది. అది అర్ధరాత్రి సమయం.. ఏం జరిగిందో ఏమో.. దూసుకెళ్తున్న ట్రైన్ ఆగిపోయింది. నిద్రలో ఉన్న ప్రయాణీకులు ఠక్కున లేచి కూర్చున్నారు. ఈలోగా ఏదో అలికిడి.. ఆ వివరాలు ఏంటో..? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
పల్నాడు జిల్లా దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా రెండు రోజుల నుంచి రాత్రివేళ రైళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. మంగళవారం రాత్రి నాగర్‌సోల్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో.. సోమవారం హైదరాబాద్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీలు జరిగింది. నడికుడి జంక్షన్ సమీపంలో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో S1,S3 భోగిలో చోరీ చేశారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి ఆపిన నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో.. నిద్రిస్తున్న ప్రయాణికురాలి మెడలో ఉన్న 68 తులాల బంగారు గొలుసును దొంగలు లాక్కుని వెళ్లారు. S5 భోగిలోని ప్రయాణికులు శబ్దాలు విని ఒక్కసారిగా కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. దోచుకెళ్ళిన బంగారు ఆభరణాలు విజయవాడకు చెందిన ప్రయాణికురాలు శ్రీదేవివి కాగా.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు. న్యూ పిడుగురాళ్ల, తుమ్మలచెరువు, నడికుడి, రైల్వే స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

