AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భగ్గుమన్న బంగారం ధర..రూ.లక్షా 15వేల చేరువలో వీడియో

భగ్గుమన్న బంగారం ధర..రూ.లక్షా 15వేల చేరువలో వీడియో

Samatha J
|

Updated on: Sep 17, 2025 | 5:59 PM

Share

బంగారం ధర సరికొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం కొనుగోలుదారులకు కాస్త ఊరట కల్గించిన బంగారం ధర.. మంగళవారం గరిష్ట ధర దిశగా దూసుకుపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ బలహీనపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న బలమైన అంచనాల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతో ధరలు ఆకాశాన్నంటాయి.

సెప్టెంబర్ 16, మంగళవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్​‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధరరూ. 1,02,819గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,11,079గా కొనసాగుతోంది. ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,46,200గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల తులం పసిడి రూ. 1,01,825 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,11,085గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,47,000గా ఉంది. ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,01,827గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,11,087ను ఉంది.విశాఖలో కేజీ సిల్వర్​ రేటు రూ. 1,44,600గా ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 1,01,805గా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,11,065గా ఉండగా, కేజీ వెండి రేటు రూ. 1,35,000గా ఉంది. ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 1,02,111గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,11,391గాను ఉంది. కేజీ వెండి ధర రూ. 1,45,600గా ఉంది.

మరిన్నివీడియోల కోసం :

భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో

ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో

నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో

జ‌పాన్‌లో ల‌క్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో