AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్షలాదిమంది మనసు గెలిచిన అమ్మ.. బిడ్డను వీపుపై మోస్తూ..

లక్షలాదిమంది మనసు గెలిచిన అమ్మ.. బిడ్డను వీపుపై మోస్తూ..

Phani CH
|

Updated on: Oct 14, 2026 | 9:04 PM

Share

లడఖ్‌లో విపరీతమైన చలిలో పసిబిడ్డను వీపుపై కట్టుకుని పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న ఓ తల్లి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబ బాధ్యతలను మోస్తూనే విధులు నిర్వహిస్తున్న ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడియో తీసిన ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఆమెను సంప్రదించి, నెటిజన్ల నుంచి సేకరించిన విరాళాలను చిన్నారి భవిష్యత్తు కోసం అందించాలని నిర్ణయించినట్లు కథనం చెబుతోంది. ఈ ఘటన ఎందరో హృదయాలను కదిలిస్తోంది.

ఒకవైపు తల్లిగా చిన్నారి బాధ్యత.. మరోవైపు జీవన పోరాటం… ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఓ తల్లి పడుతున్న కష్టం నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. లడఖ్‌లో ఓ మహిళ తన పసిబిడ్డను వీపుపై కట్టుకుని విపరీతమైన చలిలో పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ తల్లి విపరీతమైన చలిని లెక్కచేయకుండా చంటిబిడ్డను వీపున కట్టుకొని పెట్రోటు బంక్‌లో తన పనిలో మునిగిపోయింది. చలికి తట్టుకునేలా బిడ్డను వెచ్చటి బట్టలతో చుట్టి, వీపునకు సురక్షితంగా కట్టుకుని వాహనదారులకు పెట్రోల్ కొడుతూ, ఏమాత్రం ఆటంకం లేకుండా తన విధులు నిర్వర్తిస్తున్న ఆమె నిబద్ధత అందరినీ కట్టిపడేసింది. పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. వ్యూస్ సాధించి నెట్టింట ప్రభంజనం సృష్టించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఈమె నిజమైన యోధురాలు”, “నవయుగ ఝాన్సీ లక్ష్మీబాయి” అంటూ కొనియాడుతున్నారు. కుటుంబ బాధ్యతలను మోస్తూనే బయట పనిచేసే మహిళల కష్టానికి ఈ వీడియో అద్దం పడుతోందని కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్ల నుంచి వచ్చిన అపూర్వ స్పందనను చూసిన ఆ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఆ తల్లిని వీడియో కాల్ ద్వారా సంప్రదించారు. తన వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసుకుని ఆ తల్లి ఆశ్చర్యపోయింది. నెటిజన్ల నుంచి సేకరించిన విరాళాలను ఆమె చిన్నారి భవిష్యత్తు నిధి కోసం అందించడానికి నిశ్చయించారు. ఒక చిన్న వీడియో ఒక తల్లి కష్టాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, ఆమె కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడం సోషల్ మీడియాలోని సానుకూల కోణానికి నిదర్శనంగా నిలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్‌!

బాబోయ్‌.. వింతపాము…రెండు తలలు, నాలుగు కాళ్లతో

చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం

ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!

అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!

Follow Us