తండ్రీ కొడుకుల ప్రాణం తీసిన ఇంటి గోడ
కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని ఓ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కష్టపడి కట్టించుకున్న ఇల్లే.. తండ్రి కొడుకుల ప్రాణాలను బలి తీసుకుంది. భారీ వర్షాలతో ఇల్లు కూలి ఇద్దరూ మృతి చెందారు. ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
ఈ సంఘటన చూసిన ఊరంతా కన్నీరు పెట్టుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు పాత గోడ నాని అర్థరాత్రి పక్కనే ఉన్న షెడ్ పై కుప్పకూలింది. కూలిన గోడకు ఆనుకుని వేసుకున్న షెడ్ లో నివసిస్తున్న తండ్రి కొడుకులు మృతి చెందారు. తండ్రి నాగరాజు అలియాస్ శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాగా, పద్నాలుగేళ్ల కుమారుడు లక్ష్మి నరసింహ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో నాగరాజ్ తల్లి లక్ష్మిదేవి, తమ్ముడు రాజు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గాయపడిన వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇల్లు కూలిపోయి ప్రాణాలు పోగొట్టుకున్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ కీచక తండ్రికి చచ్చే వరకు జైలు శిక్ష.. పోక్సో కేసులో సంచలన తీర్పు
మా సినిమాల మీద మీ పెత్తనం ఏంటి ??
బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామంటూ వచ్చి.. చివరికి
