Sangameshwara Temple: ఓ వైపు భక్తి.. మరోవైపు ఆందోళన..

|

Oct 16, 2023 | 6:16 PM

త్రివేణీ సంగమమే అద్భుతం అనుకుంటే . అంతకు మించిన అద్భుతం సప్తనదులు సంగమ క్షేత్రం సంగమేశ్వర ఆలయం. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమేపీ తగ్గుతుండటంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ ప్రాంతం లోని సంగమేశ్వరుడు నెమ్మదిగా జలధివాసం వీడుతున్నాడు. ప్రస్తుతం కృష్ణాజలాలు సంగమే శ్వర ఆలయ ప్రహరీ దగ్గరగా వచ్చాయి. కేవలం 10 అడుగుల నీటిమట్టం తగ్గితే ఆలయం పూర్తిగా బయటపడుతుంది.

త్రివేణీ సంగమమే అద్భుతం అనుకుంటే . అంతకు మించిన అద్భుతం సప్తనదులు సంగమ క్షేత్రం సంగమేశ్వర ఆలయం. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమేపీ తగ్గుతుండటంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్తనదుల సంగమ ప్రాంతం లోని సంగమేశ్వరుడు నెమ్మదిగా జలధివాసం వీడుతున్నాడు. ప్రస్తుతం కృష్ణాజలాలు సంగమే శ్వర ఆలయ ప్రహరీ దగ్గరగా వచ్చాయి. కేవలం 10 అడుగుల నీటిమట్టం తగ్గితే ఆలయం పూర్తిగా బయటపడుతుంది. తీవ్ర వర్షభావం దృష్ట్యా , ఉన్న కృష్ణానది జలాలను రెండు తెలుగు రాష్ట్రాలు విరివిగా వినియోగిస్తుండడంతో శ్రీశైల జలాశయంలో రోజు అడుగు మేర నీటిమట్టం తగ్గుతుంది.. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటిమట్టం 850 అడుగులకు చేరుకుంది.. మరో 10 అడుగులు తగ్గితే విజయదశమికి సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా జలధివాసం నుండి బయటకు వస్తుంది.. ఈ సంవత్సరం నాలుగు నెలల ముందు భక్తులకు సంగమేశ్వరుడు దర్శనము ఇవ్వనున్నాడని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మా ఆవిడ చితకబాదేస్తోంది.. రక్షించండి బాబోయ్‌ !! డాక్టర్‌ ఆవేదన

ప్రాణం తీసిన ఫ్రిడ్జ్ !! డోర్‌ ముట్టుకోగానే కరెంట్‌షాక్‌

‘ప్రియతమా మన ప్రేమ శాశ్వతం ’ అంటూ చివరి ఫోటో.. కానీ చివర్లో ట్విస్ట్

ఆ గ్రహశకలంపై టన్నులకొద్దీ బంగారం !! ఆసక్తికర విషయాలు వెల్లడించిన నాసా