రెయిన్‌బో డైట్‌.. ఎప్పుడైనా ట్రై చేశారా ?? దీన్ని ఫాలో అయితే కలిగే లాభాలేంటంటే ??

|

Nov 12, 2024 | 8:35 PM

పండ్లు, కూరగాయలు అన్నీ ఒకే రంగులోనే ఉండవు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నారింజ.. ఇలా వివిధ రంగులలో ఉంటాయి. ఇలా అన్నిరంగులు కలిగిన ఆహారాన్ని రెయిన్ బో ఫుడ్ అని అంటారు. అన్ని రంగులు కలిగిన ఆహారాన్ని రోజూ ఫాలో అయితే దాన్ని రెయిన్ బో డైట్ అని అంటారు. ఆరోగ్యం బాగుండాలన్నా, వయసు మీద పడినట్టు కనబడకూడదన్నా రెయిన్ బో డైట్ బాగా సహాయపడుతుంది.

రెయిన్ బో డైట్ లో రంగు రంగుల పండ్లు, కూరగాయలు ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ల శాతం ఎక్కువ. రెయిన్ బో డైట్ ను ఫాలో అయితే శరీరం శుద్ది అవుతుంది. గుండె ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం బలపడుతుంది. రెయిన్ బో డైట్ లో మొక్కల ఆధారిత ఆహారాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కో రంగులో ఒకో రకమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఉదాహరణకు.. ఎరుపు రంగులో లైకోపీన్ ఉంటుంది, ఊదా రంగులో ఆంథోసైనిన్ లు ఉంటాయి. ఇలా వివిధ రంగులలో వివిధ పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రెయిన్ బో డైట్ ఎంత వయసు పెరిగినా అందంగా కనిపించాలని అనుకునే వారికి, డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిదట. రెయిన్ బో డైట్ లో ఫైబర్ చాలా ఉంటుంది. ఇది గట్ మైక్రోబయోమ్‌కు సహాయపడుతుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. వీలైనంతవరకు రెయిన్ బో డైట్ లో ఆకుకూరలను ఎక్కువగా తినాలి. ఇవి పేగు కదలికలకు చాలా మంచివి. విటమిన్-సి, విటమిన్-ఇ అధికంగా ఉన్న సిట్రస్ పండ్లు, ఆకుకూరలు గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. వీటిలో సహజ సమ్మేళనాలు ఉంటాయి. మంటను తగ్గిస్తాయి. శరీరాన్ని ఆక్సీకరణ నష్టం నుండి కాపాడతాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా పోలీసుల కోతుల వేట..

Pushpa 2: బాధ్యతంతా బన్నీదే 7 నగరాల్లో పుష్ప 2 టీమ్ సందడి