AP News: ఆంధ్రాలోని ఆ గ్రామానికి ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు ఎమ్మెల్యేలు.. కానీ

Edited By:

Updated on: Sep 28, 2023 | 3:19 PM

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి రూరల్ మండలంలో కొండేపల్లి గ్రామంలో దాదాపు 150 పైగా గడపలున్నాయి. కొండేపల్లి గ్రామం కొంత తాడిపత్రి నియోజకవర్గం... మరికొంత సింగనమల నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. 150 గడపలు ఉన్న కొండేపల్లి గ్రామంలో దాదాపు 600 ఓట్లు ఉన్నాయి. ఈ విచిత్రమైన గ్రామం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

చిత్రమైన గ్రామం కొండేపల్లి…. ఆ గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు సర్పంచులు ఉన్నారు. ఎక్కడైనా ఒక ఊరికి ఒకరే సర్పంచ్ ఉంటారు. కానీ ఆ గ్రామానికి ఇద్దరు సర్పంచ్‌లు ఉన్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా…. ఇది వాస్తవం. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి రూరల్ మండలంలో కొండేపల్లి గ్రామంలో దాదాపు 150 పైగా గడపలున్నాయి. కొండేపల్లి గ్రామం కొంత తాడిపత్రి నియోజకవర్గం… మరికొంత సింగనమల నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. 150 గడపలు ఉన్న కొండేపల్లి గ్రామంలో దాదాపు 600 ఓట్లు ఉన్నాయి. ఇరు నియోజకవర్గాలకు దాదాపు 300 చొప్పున ఓట్లు ఉన్నాయట. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు చాలా మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారే. ఇంకా చిత్రం ఏంటంటే… రెండు నియోజకవర్గాల పరిధిలో కొండేపల్లి గ్రామం ఉండడం వల్ల సాంకేతికంగా ఆ గ్రామానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్లే లెక్క. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇద్దరూ ఆ గ్రామానికి ప్రాతినిథ్యం వహిస్తున్నట్లే లెక్క. ఇలా ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నా గ్రామంలో కనీసం సీసీ రోడ్లు కూడా లేవని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ అధికార పార్టీ చెందిన ఎమ్మెల్యేలు అయినా తమకు ఈ దుస్థితి ఏంటని వాపోతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Published on: Sep 28, 2023 03:02 PM