Kokapet: కోకాపేట ప్లాట్లకు అందుకే ఆ రేంజ్‌ ధరలు

Updated on: Dec 08, 2025 | 4:13 PM

హైదరాబాద్‌లోని కోకాపేట నియో పోలీస్ భూముల ధరలు వేల కోట్లకు చేరాయి. 2021 నుండి ఎకరం ధర రూ.40 కోట్ల నుండి రూ.143 కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదలకు కారణాలు, జరిగిన అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను కథనం వివరిస్తుంది. హెచ్‌ఎండిఏకు వేలం ద్వారా వచ్చిన రూ.3,862 కోట్లను ఎలా వినియోగించనుందో చీఫ్ ఇంజనీర్ రవీందర్ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

హైదరాబాద్ మహానగరంలోని కోకాపేట నియో పోలీస్ ప్రాంతంలో భూముల ధరలు వేలకోట్ల విలువ పలకడానికి వెనుక ఉన్న అసలు కారణం ఏంటి…!? ఇంతకీ ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది… భవిష్యత్తులో ఇక్కడ ఏం జరగబోతుంది… తెలంగాణ ప్రభుత్వానికి చెందిన భూములు 2021లో ఎకరా 40 కోట్ల పలికితే 2023లో ఎకరం ధర 73 కోట్లకు చేరింది… తాజాగా అదే ఎకరం ధర ఇప్పుడు యావరేజీగా 143 కోట్లకు పైగా ధర పలికింది. ఇక్కడున్న 29 ఎకరాలను ఈ వేలం ద్వారా హెచ్ఎండిఏ విక్రయిస్తే వచ్చిన మొత్తం అక్షరాల 3862,000 కోట్లు. మరి ఈ ఆదాయంతో హెచ్ఎండిఏ ఏం చేయబోతుంది అన్నదానిపై హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ మా టీవీ 9 సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ను ఇప్పుడు చూద్దాం…

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్‌డీ చేస్తా… పంచాయతీ పోరులో ఓ సర్పంచ్ అభ్యర్థి హామీ

ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా

అడ్డంగా దొరికిన అదనపు కలెక్టర్‌.. ఏం చేశాడంటే

రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు

ఈ కోతులు సల్లగుండా సర్పంచ్‌ ఎన్నికలనే మార్చేశాయిగా