Whats app New Update: వాట్సాప్‌ సూపర్బ్‌ ఫ్యూచర్‌..! ఇక నుండి అది కనిపించదు..

Whats app New Update: వాట్సాప్‌ సూపర్బ్‌ ఫ్యూచర్‌..! ఇక నుండి అది కనిపించదు..

Anil kumar poka

|

Updated on: May 24, 2022 | 4:51 PM

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందుస్తోంది కాబట్టే


ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అందుస్తోంది కాబట్టే ఈ వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్‌ దక్కింది. ఇతర యాప్స్‌ నుంచి వస్తోన్న పోటీని తట్టుకునే క్రమంలో కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచేసే పనిలో పడింది. సాధారణంగా వాట్సాప్‌ గ్రూప్‌ల నుంచి బయటకు వచ్చేస్తే ఆ గ్రూప్‌లో ఉన్న ప్రతీ సభ్యుడికి మీరు గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయినట్లు కనిపిస్తోంది.అయితే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు, లేదా స్నేహితులకు గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయినట్లు అలర్ట్‌ వస్తే వారు ఏమైనా అనుకుంటారేమో అనే భావన కలుగుతోంది. అలా అనీ మీకు ఆ గ్రూప్‌లో ఉండడం నచ్చదు. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇకపై గ్రూప్‌ నుంచి ఎగ్జిట్ అయితే ఆ అలర్ట్‌ గ్రూప్‌ అడ్మిన్‌కు తప్ప మరెరవరికీ కనిపించకుండా ఉండే అప్‌డేట్‌ను తీసుకురానుంది వాట్సాప్‌. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తుండగా త్వరలోనే తీసుకురానున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Published on: May 24, 2022 04:51 PM