కళ్ల ఆరోగ్యం కోసం అద్భుతమైన చిట్కాలు.. ఇలా చేస్తే కళ్లకింద నల్లటి వలయాలు మటుమాయం.. వీడియో

|

Sep 28, 2021 | 11:14 PM

మనిషికి శరీరంలో కళ్లు కూడా ముఖ్యమైనవి. ఇవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. కళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు చాలా మందికి ఏర్పడుతుంటాయి.

మనిషికి శరీరంలో కళ్లు కూడా ముఖ్యమైనవి. ఇవి బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. కళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా కళ్ల కింద నల్లటి వలయాలు చాలా మందికి ఏర్పడుతుంటాయి. ఇవి ఏర్పడటానికి కారణాలు చాలా ఉంటాయి. నిద్రలేమి, పోషకాహార లోపం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, ఎండలో ఎక్కువగా తిరగడం, అలర్జీ.. ఇలా నల్లటి వలయాలకు కారణమవుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని సులభంగా దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. కీర దోసను ముక్కలుగా కట్‌ చేసి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తరువాత వాటిని పావుగంట పాటు కళ్లపై పెట్టుకోవడం ద్వారా కళ్లకు విశ్రాంతి లభించడమే కాకుండా నల్లటి వలయాలు నెమ్మదిగా దూరమవుతాయి. అలొవెరాను కట్‌ చేసి అందులోని జెల్‌ను కళ్ల కింద భాగంలో అప్లై చేసి, ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగితే కూడా ఈ నల్లటి వలయాలు పోతాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కేరళ విల్వద్రినాథ ఆలయంలో గజరాజు బీభత్సం.. వీడియో

Viral Video : వామ్మో.. రాక్షస సుడిగాలి.. ట్రక్కును ఎత్తిపడేసింది! వీడియో

Follow us on