Shawarma: షవర్మా తింటే చనిపోతారా..? భోజన ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. అందుకే అక్కడ బ్యాన్ చేసారా..?

|

May 18, 2022 | 8:18 AM

భోజన ప్రియులు ఎంతో ఇష్టంగా ఆరగించే షవర్మాను నిషేధించారు అధికారులు. భారతీయ వంటకాల్లో భాగం కాని షవర్మా తినకూడదని సూచించారు అధికారులు. షవర్మాను విద్యార్థులు, యువత ఇష్టంగా తింటారు...


భోజన ప్రియులు ఎంతో ఇష్టంగా ఆరగించే షవర్మాను నిషేధించారు అధికారులు. భారతీయ వంటకాల్లో భాగం కాని షవర్మా తినకూడదని సూచించారు అధికారులు. షవర్మాను విద్యార్థులు, యువత ఇష్టంగా తింటారు. కానీ షవర్మా వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అలెర్ట్‌ అయి, షవర్మాను బ్యాన్‌ చేస్తున్నాయి. అయితే అరేబియన్‌ షవర్మాకు దేశ వ్యాప్తంగా ఫుల్‌ క్రేజ్‌ ఉంది. దీనిని ఎంతోఇష్టంగా తినే వాళ్లు చాలానే ఉంటారు. తమిళనాడు వెల్లూర్ జిల్లా గుడియాథంలో ఈ నిబంధన అమలులోకి వస్తుందని మేయర్ వెల్లడించారు. కేరళలో షవర్మా తిని 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవడంతో తమిళనాడు అప్రమత్తమైంది. గుడియాథం మున్సిపాలిటీ పరిధిలో షవర్మా అమ్మకాలను నిషేధిస్తున్నామని మేయర్ సౌందర రాజన్ వివరించారు. గుడియాథం మున్సిపాలిటీ ఈ తీర్మానం చేయడానికి ముందే షవర్మాపై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షవర్మా ఆయా దేశాల్లో తక్కువ ఉష్ణోగ్రతల్లో రెడీ చేస్తే షవర్మా పాడవదని, కానీ మన దేశంలో సరైన విధంగా నిల్వ చేయనందుకే ఈ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు మంత్రి సుబ్రమనియన్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 18, 2022 08:18 AM