Papikondalu Boat Services: పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. పాపికొండలకు బోటు సర్వీసులు ప్రారంభం.. (వీడియో)

|

Jan 01, 2022 | 9:29 AM

పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నవంబర్ 7వ తేదీ నుంచి పాపికొండలు బోట్ యాత్ర ప్రారంభమవుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా అధికారులు తెలిపారు. బోట్ సర్వీసుల ప్రారంభంపై రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో టూరిజం,


పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నవంబర్ 7వ తేదీ నుంచి పాపికొండలు బోట్ యాత్ర ప్రారంభమవుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా అధికారులు తెలిపారు. బోట్ సర్వీసుల ప్రారంభంపై రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో టూరిజం, పోలీసులు అధికారులతో కలెక్టర్ హరి కిరణ్ సమావేశం నిర్వహించారు. బోటు ఆపరేటర్లు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాత్రికుల భద్రత, బోట్ టూర్ ఆపరేటర్లు, ఫెర్రీ ఆపరేటర్లు పాటించవలసిన నిబంధనల గురించి కలెక్టర్ వివరించారు. తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని.. కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

ప్రయాణికులు భౌతిక దూరం పాటించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. బోటు సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో నవంబర్‌ 6న గండి పోచమ్మ ఆలయం బోట్ పోయింట్ వద్ద ట్రయిల్ రన్ నిర్వహించారు. అయితే.. రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడికి రవాణా, భోజన వసతితో కలిపి టికెట్‌ ధరను 1,250 రూపాయలుగా నిర్ణయించారు. కాగా గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసారు. పాపికొండల సర్వీసులతోపాటు భవానీద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో బోట్లు నడపనున్నట్టు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఎస్.సత్యనారాయణ పేర్కొన్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Published on: Jan 01, 2022 09:28 AM