Know This: ఏలియన్స్‌తో మూడో ప్రపంచయుద్ధం.. అమెరికా మిలటరీ ఆఫీసర్‌ సంచనలన కామెంట్స్‌.!(వీడియో)

Third World War with Aliens: అనంత విశ్వంలో... సైన్స్‌కు అందని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అవి మన ఊహలకు, అంచనాలకు ఏమాత్రం అందవు..! అలా సూపర్‌పవర్‌గా భావించే వాటిలో ఒకటే ఏలియన్స్‌..! అవి అసలు ఉన్నాయో లేవో తెలియదు కానీ...

Third World War with Aliens: అనంత విశ్వంలో… సైన్స్‌కు అందని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అవి మన ఊహలకు, అంచనాలకు ఏమాత్రం అందవు..! అలా సూపర్‌పవర్‌గా భావించే వాటిలో ఒకటే ఏలియన్స్‌..! అవి అసలు ఉన్నాయో లేవో తెలియదు కానీ… ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా… ఏదో ఓ ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. అందుకే దశాబ్దాల అన్వేషణలో గ్రహంతరవాసులకు సంబంధించి.. ఏ ఒక్క ఆధారం దొరక్కపోయినా… వెతుకులాట మాత్రం ఆగడం లేదు. తాజాగా.. ఏలియన్స్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వార్తల్లోకి వచ్చింది. మూడో ప్రపంచయుద్ధం అంటూ వస్తే.. అది ఏలియన్స్‌తోనేనన్న వార్త ఇప్పుడు యావత్‌ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తోంది.

నిన్నటి వరకు ఓ లెక్క.. ఇవాళ్టి నుంచి ఇంకో లెక్క… అవును.. నిన్నటి వరకు ఏలియన్స్‌ అమెరికాలోని ఏరియా 51కి వచ్చి వెళ్తాయన్న వార్తలు మాత్రమే విన్నాం. కానీ తాజాగా మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే.. అది ఏలియన్స్‌తోనే వస్తుందని బల్లగుద్ది మరీ చెప్పాడు యూఎస్‌ మిలటరీ ఆఫీసర్‌ రాబర్ట్‌ సలాస్‌. అంతేకాదు ఏలియన్స్‌ అణు క్షిపణులను ట్యాంపరింగ్‌ చేస్తున్నట్లు తాను గుర్తించానని సలాస్‌ తెలిపాడు. ఈ మేరకు గ్రహాంతరవాసులు వేరోక గ్రహం నుంచి వచ్చి అణు లక్ష్యాల వద్ద ఆయుధ వ్యవస్థలను తారుమారు చేసి, వాటిని నిలిపివేసినట్లు పేర్కొన్నాడు.

అణు క్షిపణులను యాక్టివేట్‌ చేయడం మొదలు పెట్టడమే కాకుండా దాదాపు పది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు నిర్విర్యం చేసిన‍ట్ల వెల్లడించాడు రాబర్ట్‌ సలాస్‌. అంతేకాదు ఈ విషయానికి సంబంధించి నలుగురు యూఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లు త్వరలో పత్రాలను విడుదల చేస్తారని కూడా వెల్లడించాడు. సలాస్‌ యూఎస్‌ ఆధునిక విధ్వంసక అణు క్షిపణి కార్యక్రమంగా పేరుగాంచిన టైటాన్3 ప్రోగ్రామ్‌లో ఎయిర్ ఫోర్స్ క్షిపణి ప్రొపల్షన్ ఇంజనీర్‌గానూ, యూఎస్‌ వెపన్‌ కం‍ట్రోలర్‌గానూ పనిచేస్తున్నాడు. అంతేకాదు 1971నుంచి 1973 వరకు స్పేస్ షటిల్ డిజైన్ ప్రతిపాదనలకు సంబంధించిన మార్టిన్-మారిటా ఏరోస్పేస్, రాక్‌వెల్ ఇంటర్నేషనల్ సంస్థలకు అత్యంత విశ్వసనీయత కలిగిన ఇంజనీర్‌గా కూడా సేవలందించాడు.

ఇదిలా ఉంటే… అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్‌ బుష్‌ నుంచి బరక్‌ ఒబామా, రొనాల్డ్‌ ట్రంప్‌, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ల వరకు ఏలియన్స్‌ సంబంధాలు ఉన్నాయన్న టాక్‌ ఉంది. అంతేకాదు.. అమెరికాలోని ఏరియా 51ప్రాంతంకు ఏలియన్స్‌ వస్తూపోతూ ఉంటాయంటూ పలు వార్తలు, అలాగే ఫోటోలు కూడా వైరల్‌ అయ్యాయి. ఇక ఈ వార్తల అనుగూణంగానే ఆ ప్రాంతంలోకి ఎలాంటి వాహనం వెళ్లడం కానీ, కనీసం ఆ ప్రాంతం పైభాగం నుంచి విమానాలు, డ్రోన్లు ఎగరేయడం నిషేధం విధించింది అమెరికా ప్రభుత్వం. దీంతో ఈ వార్తలకు మరింత ఆజ్యంపోసిన్నట్లు అయింది.అంతేకాదు.. ఈ ఏరియా 51లో పని చేసే ఏ ఒక్కరు మనకు కనిపించారు. ఆ భూభాగం మొత్తం ఓ భారీ భవనం ఉంటుంది. దానిలో నుంచి అన్ని రకాల ప్రయోగాలు జరుతుంటాయన్న టాక్‌ ఉంది. ఆ ప్రాంతానికి ఏలియన్స్‌ వస్తుంటాయని, ఇక్కడ మనుషులతో తమకు కావాల్సిన పనిని చేసుకుని తిరిగి వాటి గ్రహంపైకి వెళ్లిపోతాయంటా. వందల ఎకరాల్లో ఉన్న ఈ ప్రాంతంలోకి భయటి వ్యక్తులు వచ్చేందుకు ప్రయత్నిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు అమెరికా పోలీసులు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అమెరికాలోనే Highly restricted area అన్న మాటా.

మరిన్ని చదవండి ఇక్కడ: Kim Beer Video: హాయిగా బీరు తాగుతూ.. ఎంజాయ్ చేసిన కిమ్.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..

Pigeon Video: ఆ పావురం కోసం.. డ్రోన్‌తో పోలీసుల రెస్క్యూ.. చివరికి విద్యుత్‌ వైర్ల మధ్యలో..(వీడియో)

News Watch: చేయాల్సింది చాలా ఉంది, ముందస్తుకు వెళ్లం ~కేసీఆర్… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

Mohan Babu: లోకేష్‌ను ఓడగొట్టినా.. నా కొడుకుకు తోడున్నాడు.. దటీజ్‌ బాలయ్య ~ మోహన్ బాబు షాకింగ్ నిజాలు (వీడియో)

Click on your DTH Provider to Add TV9 Telugu