ISRO Recruitment: మీకు ట్రాన్స్‌లేట్‌ చేయడం తెలుసా.. ఇస్రోలో జాబ్‌ గ్యారంటీ..! నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఇస్రో..(వీడియో)

|

Nov 13, 2021 | 9:28 AM

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. బెంగళూరులోని ఇస్రో హ్యూమన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ప్లయిట్ సెంటర్‌ పలు పోస్టులను భర్తీ చేయనున్న నేపధ్యంలో జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశారు.


భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. బెంగళూరులోని ఇస్రో హ్యూమన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ప్లయిట్ సెంటర్‌ పలు పోస్టులను భర్తీ చేయనున్న నేపధ్యంలో జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఎలాంటి విద్యార్హతలు ఉండాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలిలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నోటిఫికేషన్‌లో ప్రకారం మొత్తం 06 జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు హిందీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు హిందీ నుంచి ఇంగ్లిష్‌, ఇంగ్లిష్‌ నుంచి హిందీలోకి అనువాదం చేయగలిగి ఉండాలి. వీరి వయసు 20-11-2021 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షను ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పార్ట్‌–ఏ ఆబ్జెక్టివ్, పార్ట్‌–బి డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు. రాతపరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థుల్ని స్కిల్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. రాతపరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 20-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Follow us on