coffee with cooker: వాట్ ఏ ఐడియా సర్‌జీ.. క్షణాల్లో కుక్కర్ ప్రెజర్‌తో వేడి వేడి కాఫీ.! (వీడియో)

|

Dec 11, 2021 | 6:42 PM

కరోనా మహమ్మారి మిగిల్చిన కష్టాలు అన్నీఇన్ని కావు. వ్యాపారాలు మూత పడ్డాయి. చేస్తున్న ఉద్యోగం పోయి చిన్న చిన్న వ్యాపారులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇలాంటి కష్ట సమయంలోనూ కాస్త తెలివిగా ఆలోచిస్తే ఈజీగా


కరోనా మహమ్మారి మిగిల్చిన కష్టాలు అన్నీఇన్ని కావు. వ్యాపారాలు మూత పడ్డాయి. చేస్తున్న ఉద్యోగం పోయి చిన్న చిన్న వ్యాపారులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇలాంటి కష్ట సమయంలోనూ కాస్త తెలివిగా ఆలోచిస్తే ఈజీగా ఆదాయం సంపాదించవచ్చని నిరూపించాడు ఓ వ్యక్తి. ఓ ఐడియాతో సరికొత్త చాయ్ వాలా అవతారమెత్తి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు.ప్రతి ఒక్కరు తమ రోజును ఒక కప్పు కాఫీ లేదా టీతో మొదలు పెడుతుంటారు. ఇంట్లో ఛాయ్ తాగే పరిస్థితి లేని వారు.. బయట ఎక్కడ దొరుకుతందా అని వెతుక్కొని మరీ తాగుతారు. ప్రపంచంలోని చాలామంది కాఫీతోనే ఎంజాయ్ చేస్తుంటారు. దీన్ని వెరైటీగా చేసి మెప్పు పొందాలనుకున్నాడు ఓ వ్యక్తి. కాస్త కొత్తగా.. వింతగా ఆలోచించాడు. ప్రెజర్ కుక్కర్‌ని ఉపయోగించి కాఫీ తయారు చేయడం గురించి ఎప్పుడైనా చూశారా.. కనీసం విన్నారా..? ఇటీవల, గ్వాలియర్‌కు చెందిన ఈ వ్యక్తి వేడి వేడి కాఫీని అలా ప్రెజర్ కుక్కర్ తో చేస్తూ.. తన కాఫీకి డిమాండ్ పెంచుకుంటున్నాడు. అతడు కాఫీ తయారు చేయడాన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు.