Amarnath yatra: అమర్‌నాథ్‌ యాత్రపై టెర్రరిస్టుల గురి.. సాంబా సెక్టర్‌లో హైఅలర్ట్‌.!

|

Jul 07, 2022 | 8:57 AM

జమ్ముకశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రవాదులు గురిపెట్టినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో హైఅలర్ట్‌ ప్రకటించింది కేంద్ర హోంశాఖ.


జమ్ముకశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్రవాదులు గురిపెట్టినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో హైఅలర్ట్‌ ప్రకటించింది కేంద్ర హోంశాఖ. సాంబా సెక్టార్‌లో ఇంటర్నేషనల్‌ సరిహద్దు దగ్గర పాక్‌ డ్రోన్‌ తీవ్ర కలకలం రేపింది. దీంతో భద్రతా బలగాలు భారీ కూంబింగ్‌ను చేపట్టాయి. దాదాపు 200 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో సరిహద్దుల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు.ఇక ఈ ఏడాది మే నెలలో జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో సొరంగం బయటపడింది. పాకిస్తాన్‌ నుంచి ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు తీవ్రవాదులు ఈ భారీ సొరంగాన్ని తవ్వారని ఇండియన్ ఆర్మీ తెలిపింది. రహస్య సొరంగం నుంచి తీవ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించడంతో హైఅలర్ట్ ప్రకటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Friendship video: నలుగురు ఫ్రెండ్స్‌.. ఒకటే గొడుగు.. స్కూల్ ఏమో దూరం..! ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే..

Pocket Money 40 lakhs: ఆమె ఒక్కరోజు పాకెట్‌ మనీ రూ. 40లక్షలు.. చుస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Mosquitoes: దోమలు కొందరినే కుట్టడానికి కారణం.. ? శరీర వాసనలలో మార్పులా..?

Follow us on