Egg Yolks video: గుడ్డులోని పచ్చ సొన తినడం లేదా.. అయితే మీరు చాలా నష్టపోతారు..!(వీడియో)

|

Jan 02, 2022 | 9:05 AM

రోజుకో గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని తరచూ వైద్యులు చెబుతుంటారు. అయితే ఇప్పటికీ కొంతమందికి గుడ్డుపై అపోహలు చాలానే ఉన్నాయి. ఉడకబెట్టిన గుడ్డులోని పసుపు భాగం తినకూడదని అంటారు. అంతేకాదు ....


రోజుకో గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని తరచూ వైద్యులు చెబుతుంటారు. అయితే ఇప్పటికీ కొంతమందికి గుడ్డుపై అపోహలు చాలానే ఉన్నాయి. ఉడకబెట్టిన గుడ్డులోని పసుపు భాగం తినకూడదని అంటారు. అంతేకాదు అది తింటే గుండెపోటు వస్తుందని, కొవ్వు పెరుగుతుందని అది ఆరోగ్యానికి మంచిది కాదని వాదిస్తారు. ఇది ఎంతవరకూ నిజమో తెలుసుకుందాం. గుడ్డులోని పసుపు భాగంలో విటమిన్లతో పాటు కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. పచ్చసొనలో కొలెస్ట్రాల్ దాదాపు 185 గ్రాముల వరకు ఉంటుంది. అందువల్లే కొలెస్ట్రాల్‌ను నివారించడానికి చాలామంది ఈ పసుపు భాగాన్ని తినరు. అలాగే క్యాలరీల విషయంలోనూ చాలామంది పచ్చసొనను తినడానికి ఇష్టపడరు. గుడ్డులో ఉండే 72 క్యాలరీల్లో దాదాపు 55 కేలరీలు పచ్చసొనవి కాగా.. తెలుపు భాగంలో 17 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. అందువల్ల, క్యాలరీల సంఖ్యను తగ్గించడంలో భాగంగా పసుపు భాగాన్ని తినరు.అయితే ఇది ఎంతవరకు నిజం? కొలెస్ట్రాల్ విషయం గురించి మాట్లాడితే.. పచ్చసొనలో ఉండే కొలెస్ట్రాల్ శరీరానికి హానికరం కాదు. ఇదే కాకుండా గుడ్డులోని పచ్చసోనలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా అవసరం కూడా. గుడ్డులోని పసుపు భాగంలో విటమిన్ ఎ, డి, ఈ, కె, ఒమేగా-3 కొవ్వులు ఉంటాయి. గుడ్డులోని తెల్ల భాగంతో పోలిస్తే పసుపు భాగంలో ఫోలేట్, విటమిన్ B12 ఎక్కువగా ఉంటాయి. అలాగే గుడ్డు పచ్చసొనలో ఐరన్, రైబోఫ్లావిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఏ డైట్ తీసుకోవాలనుకున్నా.. మీరు ఖచ్చితంగా ఒకసారి డైటీషియన్‌ సలహా తీసుకోవడం మంచిది.

Follow us on