కాన్సర్‌ బాధితులపై భేషుగ్గా పని చేస్తున్న కోవిడ్‌ టీకా.. వీడియో

|

Sep 25, 2021 | 8:17 AM

కొవిడ్‌-19 టీకాలు క్యాన్సర్‌ రోగులపైనా సమర్థంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో నిరూపితమైంది. వీరికి కూడా అవి కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణ ప్రజల్లో తలెత్తే చిన్నపాటి దుష్ప్రభావాలే వీరిలోనూ గమనించామని వెల్లడించారు.

కొవిడ్‌-19 టీకాలు క్యాన్సర్‌ రోగులపైనా సమర్థంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో నిరూపితమైంది. వీరికి కూడా అవి కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణ ప్రజల్లో తలెత్తే చిన్నపాటి దుష్ప్రభావాలే వీరిలోనూ గమనించామని వెల్లడించారు. క్యాన్సర్‌ బాధితులకు మూడో డోసు వల్ల కరోనా నుంచి మరింత రక్షణ లభిస్తుందని తెలిపారు. వర్చువల్‌గా జరిగిన యూరోపియన్‌ సొసైటీ ఫర్‌ మెడికల్‌ ఆంకాలజీ – ఎస్మో సదస్సులో పరిశోధకులు ఈ వివరాలను సమర్పించారు. టీకాల అభివృద్ధి సమయంలో నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌లో క్యాన్సర్‌ బాధితులను చేర్చలేదు. ఆరోగ్యపరంగా నీరసంగా ఉండే వీరికి ఈ టీకాలు సురక్షితమేనా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కొన్నిరకాల మందుల వల్ల వీరిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని, అందువల్ల తీవ్రస్థాయి కొవిడ్‌ నుంచి వీరికి రక్షణ లభిస్తుందా అనే సందేహాలు వచ్చాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నది దాటుతున్నారు.. మెక్సికోలోకి హైతియన్లు.. ఎందుకలా..?? వీడియో

బద్ధలైన అగ్నిపర్వతం.. ఇళ్లలోకి వచ్చిన లావా.. 5వేల మంది తరలింపు.. వీడియో

Follow us on