Low BP for Heart Attack: మీకు తెలుసా..? స్ట్రోక్‌కు లో బీపీ కూడా కారణం .. జాగ్రత్తలు తప్పనిసరి..!(వీడియో)

Updated on: Nov 17, 2021 | 9:41 AM

అధిక రక్తపోటు స్ట్రోక్‌కు ప్రధాన కారణమని చాలా మందికి తెలుసు. అయితే ఇటీవలి పరిశోధనలో మరొక కారణం వెలుగులోకి వచ్చింది. కొత్త పరిశోధన ప్రకారం, తక్కువ రక్తపోటు కూడా స్ట్రోక్‌కు కారణమవుతుంది. తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న


అధిక రక్తపోటు స్ట్రోక్‌కు ప్రధాన కారణమని చాలా మందికి తెలుసు. అయితే ఇటీవలి పరిశోధనలో మరొక కారణం వెలుగులోకి వచ్చింది. కొత్త పరిశోధన ప్రకారం, తక్కువ రక్తపోటు కూడా స్ట్రోక్‌కు కారణమవుతుంది. తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న రోగులలో 10 శాతం మందికి స్ట్రోక్ ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు మాత్రమే కాదు, తక్కువ రక్తపోటు కూడా స్ట్రోక్‌కు కారణమవుతుందని పరిశోధన డేటా చెబుతోంది.నిత్యం ఉద్యోగం చేసే మహిళలు, పురుషులు వారికి తెలియకుండానే లో బీపీతో బాధపడుతున్నారు. ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోతున్నారు. అప్పుడు కానీ తెలియడం లేదు వారికి ఈ సమస్య ఉందని. చాలా మంది ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. తినే ఆహారం, వ్యాయామం చేయకపోవడం, సమయ పాలన పాటించకపోవడం, రాత్రిళ్లు ఎక్కువ టైం మేల్కొనడం లాంటివి కారణాలు. వీటిని చాలా మంది లైట్ తీసుకుంటారు కానీ ఒక్కోసారి అది ప్రాణాల మీదకు తెస్తోంది.

లోబీపీ ఉందా లేదా అన్నది కొన్ని లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. కూర్చొని పైకి లేచినప్పుడు తల దిమ్ముగా అనిపిస్తుంది. కళ్లు మసగ్గా కనపిస్తాయి. త్వరగా అలసిపోతారు. ఎక్కువ సేపు పనిచేయలేరు. తలనొప్పి , వికారంగా కూడా ఉంటుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి.. లో బీపీపై నిఘా ఉంచాలి. కాబట్టి ఆహారంలో ఉప్పు మొత్తాన్ని సాధారణంగా ఉంచండి. రోజంతా కనీసం 8 గ్లాసుల నీరు తాగండి. ధ్యానం, వాకింగ్‌ క్రమం తప్పకుండా చేసి ఒత్తిడిని తగ్గించండి. సిగరెట్లు, మద్యం ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లతో సమతుల ఆహారం తినండి. కేవలం కార్బోహైడ్రేట్లు అధికం ఉన్న ఆహారం తినడం తగ్గించండి.
మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Published on: Nov 17, 2021 09:27 AM