Banana Benefits: ఆ టైంలో అరటి పండు తినకూడదా?.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు..! (వీడియో)

|

Oct 28, 2021 | 5:00 PM

ప్రస్తుతం కాలంలో మారుతున్న జీవన శైలి కారణంగా కడుపు నొప్పి అనేది చాలా మందికి సర్వసాధారణ సమస్యగా మారింది. రకరకాల ఉదర సంబంధిత సమస్యలతో ఇలా కడుపునొప్పి వస్తుంటుంది. తీవ్రమైన సమస్యలు మినహా.. సాధారణ సమస్యలను లైట్ తీసుకోవచ్చు.

ప్రస్తుతం కాలంలో మారుతున్న జీవన శైలి కారణంగా కడుపు నొప్పి అనేది చాలా మందికి సర్వసాధారణ సమస్యగా మారింది. రకరకాల ఉదర సంబంధిత సమస్యలతో ఇలా కడుపునొప్పి వస్తుంటుంది. తీవ్రమైన సమస్యలు మినహా.. సాధారణ సమస్యలను లైట్ తీసుకోవచ్చు. అంతర్లీనంగా సీరియస్ సమస్యలు ఉంటే మాత్రం తక్షణమే వైద్యులను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి అజీర్తి కారణంగా చాలామంది కడుపు నొప్పితో బాధపడుతుంటారు. ఇంకా ఆకలితో, అసిడిటితో బాధపడుతుంటారు. కడుపు నొప్పి వస్తున్నప్పుడు సహజంగానే ఉపశమన చర్యలు తీసుకుంటాం. అయితే, చాలా మంది కడుపు నొప్పు సమయంలో అరటి పండ్లు తినొద్దని చెబుతుంటారు. అలా తింటే కడుపు నొప్పి సమస్య మరింత పెరుగుతుందటారు. అయితే, అదంతా ట్రాష్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటి పండ్లు తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు దూరమవుతాయే తప్ప.. ఎక్కువ కావని క్లారిటీ ఇస్తున్నారు. అరటి పండు తినడం వలన మంచే జరుగుతుందని, ఇందులో ఉండే యాంటాసిడ్ వల్ల అజీర్తి సమస్యలు తగ్గుతాయంటున్నారు.
అయితే సాధారణ కడుపునొప్పిని చిన్నపాటి చిట్కాలతో తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ నిమ్మరసం తీసుకొని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలి. ఈ నీటిని తాగడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. లేదంటే.. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ చక్కెర వేసి రెండింటిని బాగా కలుపుకొని తాగాలి. కుదరకపోతే.. జీలకర్ర, చక్కెర రెండింటిని బాగా నమిలి తినాలి. దీనివల్ల కడుపు నొప్పి నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. ఇంకా ఉదర సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే.. తినే ఆహారం మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పప్పులు, ఆకు కూరలు, పీచు పదార్థాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని, నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Follow us on