Enkoor: సమీపంగా వచ్చి ఢీకొన్న రెండు కార్లు.. క్షణాల వ్యవధిలో

Updated on: Aug 13, 2025 | 8:22 PM

ఏనుకూరు మండలం జన్నారం గ్రామం సమీపంలో ఎదురెదురుగా దూసుకొచ్చిన రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఒక కారు మంటలకు ఆహుతైంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరో కారులో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు ..

ఏనుకూరు మండలం జన్నారం గ్రామం సమీపంలో బుధవారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్న మరో కారు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. సకాలంలో అప్రమత్తమైన ప్రయాణికులు కారు నుంచి బయటపడి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ఘటనలో మరో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు.

స్థానికుల ప్రకారం, రెండు కార్లు అధిక వేగంతో వస్తుండటమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోకపోవడం తృటిలో తప్పిన విషాదంగా భావిస్తున్నారు.

 

Published on: Aug 13, 2025 08:22 PM