Khairatabad Ganesh Live: బై బై గణేషా.. కన్నులపండువగా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనోత్సవం..
Khairatabad Ganesh Updates: హైదరాబాద్‌లో గణేష్ మహా శోభాయాత్ర ప్రారంభమైంది. నిమజ్జనానికి రాత్రి నుంచే గణనాథులు తరలివస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్‌పై సందడి మొదలైపోయింది. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది. 63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహా విద్యాగణపతిగా కొలువైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయత్ర కోసం పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు.
Khairatabad Ganesh Updates: హైదరాబాద్‌లో గణేష్ మహా శోభాయాత్ర ప్రారంభమైంది. నిమజ్జనానికి రాత్రి నుంచే గణనాథులు తరలివస్తున్నారు. దీంతో ట్యాంక్‌బండ్‌పై సందడి మొదలైపోయింది. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది. 63 అడుగుల ఎత్తులో శ్రీ దశమహా విద్యాగణపతిగా కొలువైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయత్ర కోసం పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన వేడుకకు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7 గంటలకు మహా గణపతి శోభాయాత్ర ప్రారంభమై.. టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా శోభాయాత్ర కొనసాగనుంది. ఉదయం 9:30కు ఎన్టీఆర్ మార్గ్‌కు, ఉదయం 10:30కు క్రేన్ నెంబర్ 4 దగ్గర పూజా కార్యక్రమం జరగనుంది. ఉదయం 11:30 గంటలకు ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం జరగనుంది. మ.12 గంటల్లోపు మహా గణపతి నిమజ్జన కార్యక్రమం పూర్తి కానుంది. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గణేష్ మహా శోభాయాత్ర నేపపథ్యంలో వినాయక నిమజ్జనాలకు జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈరోజు 50 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ట్యాంక్‌బండ్‌తో పాటు పలు చెరువులు, రబ్బర్ డ్యామ్స్, బేబీ పాండ్స్‌లో నిమజ్జనాలు జరగనున్నాయి. హుస్సేన్‌సాగర్ చుట్టూ 5 చోట్ల 36 భారీ క్రేన్లను మోహరించారు. ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ, భద్రతా బలగాలతో పకడ్బంధీగా చర్యలు తీసుకున్నారు. 20వేల సీసీకెమెరాలతో పటిష్ట నిఘా.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో..25,694 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. సున్నిత ప్రాంతాల్లో ఆర్‌పీఎఫ్, పారామిలిటరీ భద్రత, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6 వేల పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నారు. నగరంలో 354 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుంది. నిమజ్జన ప్రాంతాల దగ్గర డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లను కూడా మోహరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..