తమ్ముడిని చంపిన అక్క.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసేస్తున్నారు. ప్రేమించిన వాళ్ళు దక్కలేకనో, వివాహిత సంబంధానికి అడ్డుగా ఉన్నారనో భర్తను భార్య, భార్యను భర్త నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తున్నారు. కొందరైతే తాను ఒక తల్లి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి కన్నబిడ్డలను కడతేరుస్తున్నారు. తాజాగా కర్ణాటకలో వీటికి భిన్నమైన ధారణం చోటుచేసుకుంది. వ్యాధి సోకిన సోదరుడికి అండగా నిలిచి వైద్యం చేయించాల్సింది పోయి సొంత అక్కే అతని ప్రాణాలు తీసేసింది.
ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా హోళాల్ కేరాపరిధిలోని దుమ్మి గ్రామంలో ఈ ధారణ ఘటన జరిగింది. తమ్ముడికి సోకిన వ్యాధి గురించి బయటపడితే పరువు పోతుందని తన భర్తతో కలిసి తమ్ముడిని చంపేసింది అతని సోదరి. దుమ్మి గ్రామానికి చెందిన నాగరాజప్ప బిడ్డలే మల్లికార్జున నిషా. నిషాకు శామనూరుకు చెందిన మంజునాథ్ తో వివాహం జరిపించారు. మల్లికార్జున బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సొంతూరుకు వస్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన మల్లికార్జునను ధావనగేరిలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ మల్లికార్జునకు రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు క్షతగాత్రుడికి నయంకాని వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని నిషాకు తెలిపారు. బాధితుడికి మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో మల్లికార్జున తనకు నయంకాని వ్యాధి సోకిందని అప్పులు చేశానని తనకు బ్రతకాలని లేదని అక్క వద్ద కన్నీటి పర్యంతమయ్యారు
మరిన్ని వీడియోల కోసం :
అమ్మ బాబోయ్..! రెస్టారెంట్ వద్ద చుక్కలు చూపించిన ఫైథాన్ వీడియో
వర్షంలో మొబైల్ సిగ్నల్ రావట్లేదా? ఇలా చేసి చూడండి వీడియో
కలవరపెడుతున్న కొత్త ఇన్ఫెక్షన్.. గుర్తించకపోతే మరణమే వీడియో