కొనేదెలా.. తినేదెలా.. వెజి’ట్రబుల్స్‌’

Updated on: Nov 19, 2025 | 5:56 PM

ఉమ్మడి కరీంనగర్‌లో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్లలో ధరలు తగ్గుతాయి, కానీ ఈసారి వర్షాలు, మొంథా తుఫాన్ కారణంగా దిగుబడి తగ్గింది. రవాణా ఖర్చులు కూడా పెరగడంతో మార్కెట్లకు సరుకు కొరత ఏర్పడింది. టమాటా, ఆకుకూరలు వంటి వాటి ధరలు రెట్టింపు కావడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై కూరగాయలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్‌లో కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయ్…! మొన్నటివరకూ ఐదు వందల రూపాయలకే నిండిపోయే బ్యాగ్… ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టినా సగం కూడా రావడంలేదు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్​ నెలల్లో కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉండి రేట్లు తక్కువగా ఉంటాయ్. ఈ ఏడాది పరిస్థితి రివర్స్​ అయ్యింది. వరుస వర్షాలు, మొంథా తుఫాన్​ ఎఫెక్ట్‌​తో కూరగాయల దిగుబడి భారీగా తగ్గింది. అలాగే రవాణా మార్గాలకు ఆటంకం కలుగడం, రవాణా ఖర్చులు పెరగడంతో మార్కెట్లకు కూరగాయల దిగుమతులు తగ్గుతున్నాయి. ఇటు కొత్త పంట చేతికి అందడానికి సమయం పట్టడంతో మార్కెట్‌‌‌‌లో కొరత ఏర్పడుతోంది. ఫలితంగా కూరగాయల ధరలు మండుతున్నాయ్. తుఫాన్‌కి ముందు… టమటా కిలో 30 నుంచి 40 రూపాయలుండేది. ఇప్పుడు 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. ఆకు కూరలు ఏవైనా తుఫాన్‌కి ముందు పెద్ద కట్ట 30 నుంచి 40 రూపాయలుంటే… ఇప్పుడు 60 నుంచి 80 పలుకుతోంది. బెండకాయ… హాఫ్ సెంచరీ దాటగా, బీరకాయ 70 నుంచి 80 పెడితేగానీ సంచిలోకి రానంటోంది. కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 500లతో కూరగాయలు కొనుగోలు చేస్తే చిన్న కుటుంబానికి సైతం వారం రోజులు రావట్లేదంటున్నారు. మొత్తంగా… పేద, సామాన్యులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సబ్పిడీపై కూరగాయలు అందించడానికి చర్యలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

షూటింగ్‌లో జక్కన్న టార్చర్‌ తట్టుకోలేకపోయా

అమ్మో గొరిల్లా.. దెబ్బకు కోతులు పరార్

షూటింగ్‌లో జక్కన్న టార్చర్‌ తట్టుకోలేకపోయా

అప్పు తీర్చమని అడిగినందుకు ఎంత పని చేశావురా ??