కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద 25 కిలోలు కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 30 వేలు ధర పలికింది. ఈ చేప లోపల ఉండే బ్లాడర్‌కి డిమాండ్ ఉండడంతో ధర ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు మత్స్యకారులు. వేట సమయంలో మత్స్యకారులకు సముద్రంలో అరుదుగా లభిస్తుంది ఈ కాచ్చిడి చేప. ఈ కారణంగానే చేపల వ్యాపారి దీన్ని అత్యధికంగా మూడు లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేశాడు. అనేక వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో ఈ కచ్చిడి చేపను వాడతారు. పిత్తాశయం, ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులకు మందులు తయారీకి చేప లోపల ఉండే బ్లడర్ ఎక్కువ ఉపయోగిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఔషధ గుణాలు కలిగిన కచ్చిడి చేప కోసం ఎదురుచూసే మత్స్యకారులకు ఇది ఒక వరమనే చెప్పాలి.