Vande Bharat Express: కాచిగూడ – బెంగళూరు వందేభారత్.. పంద్రాగస్టున పట్టాలెక్కేందుకు సిద్దం.!

Edited By:

Updated on: Aug 09, 2023 | 7:50 PM

Kacheguda To Bengaluru Vande Bharat Express: కాచిగూడ నుంచి బయలుదేరిన వందే భారత్ రైలు మధ్యాహ్నం రెండున్నర గంటలకు డోన్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. మార్గం మధ్యలో కర్నూలులోన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు భోజనం కోసం నిలిపారు. కర్నూలుకు వందే భారత్ రైలు వస్తుందన్న సమాచారంతో రైలును చూసేందుకు నగరవాసులు వచ్చారు. దీంతో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక ఈ ట్రైన్‌కు సంబంధించిన..

సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. ఇక దానికి సంబంధించిన పనులను శరవేగంగా చేస్తున్నారు రైల్వే అధికారులు. కాచిగూడ నుంచి డోన్ వరకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును బుధవారం అధికారులు ట్రైల్ రన్ నిర్వహించారు. ఉదయం కాచిగూడ నుంచి బయలుదేరిన వందే భారత్ రైలు మధ్యాహ్నం రెండున్నర గంటలకు డోన్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. మార్గం మధ్యలో కర్నూలులోన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు భోజనం కోసం నిలిపారు. కర్నూలుకు వందే భారత్ రైలు వస్తుందన్న సమాచారంతో రైలును చూసేందుకు నగరవాసులు వచ్చారు. దీంతో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ రైలు ప్రతి రోజూ కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్‌పూర్ వరకు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అయితే ఈ ట్రైన్ టైమింగ్స్, టికెట్ల వివరాలు, ఆగే స్టేషన్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Published on: Aug 09, 2023 07:48 PM