AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

Phani CH
|

Updated on: Apr 01, 2026 | 6:23 PM

Share

జడ్చర్లలో ఓ పెట్రోల్ బంక్ యజమాని డీజిల్ అక్రమ నిల్వతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టాడు. వెస్ట్ ఆసియా యుద్ధం పేరుతో వేలాది లీటర్ల డీజిల్ ను సురక్షితం కాని పద్ధతిలో నిల్వ ఉంచాడు. ఎండాకాలంలో బంక్ సమీపంలోని ఇటుక బట్టీలు, గురుకుల పాఠశాలకు ప్రమాదం పొంచి ఉంది. సివిల్ సప్లై అధికారులు 2,700 లీటర్ల డీజిల్ ను సీజ్ చేసి, యజమానిపై కఠిన చర్యలకు ఆదేశించారు.

పశ్చిమాసియాలో యుద్ధ పరిణామం గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌పై ఎంతటి ప్రభావం చూపుతుందంటే.. భయంతో కొందరు క్యాన్లతో పెట్రోలు, డీజిల్‌ కొట్టించుకొని దాచుకుంటుంటే.. ఓ బంకు యజమాని ఇదే అదనుగా అక్రమ దందా చేసేందుకు తెరలేపాడు. ఈ క్రమంలో భారీ మొత్తంలో డీజిల్‌ను స్టోర్‌ చేసిపెట్టుకున్నాడు. అదికూడా డ్రమ్ముల్లో నీళ్లు నింపి ఆరుబయట పెట్టినట్టు అత్యంత ప్రమాదకరమైన డీజిల్‌ను డ్రమ్ముల్లో నింపి బయటే వదిలేశాడు. ఊహించడానికే భయం వేసే ఈ ఘటన జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల వద్ద వెలుగుచూసింది. అక్రమ సంపాదన కోసం జనం ప్రాణాలను పణంగా పెట్టిన ఒక పెట్రోల్ బంక్ యజమాని నిర్లక్ష్యం ఇప్పుడు కలకలం రేపుతోంది. ప్రకాష్ ఫిల్లింగ్ స్టేషన్‌లో చమురు కొరతను సాకుగా చూపుతూ, దొడ్డిదారిన అమ్ముకోవడానికి భారీగా డీజిల్‌ను నిల్వ చేశారు. బంక్ ఆవరణలోనే ఒక గోడ పక్కన సింటెక్స్ ట్యాంకులు, డ్రమ్ముల్లో వేల లీటర్ల డీజిల్‌ను నింపారు. కనీసం వాటికి మూతలు కూడా బిగించకుండా, కేవలం ఒక పాత గుడ్డ, ఫ్లెక్సీ కప్పి వదిలేశారు. అసలే ఎండాకాలం, ఆవిరయ్యే పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో ఇంతటి నిర్లక్ష్యం వహించడంపై అధికారులు మండిపడుతున్నారు. ఈ బంకుకు సమీపంలోనే ఇటుక బట్టీలు ఉండటం గమనార్హం. అక్కడి నుంచి చిన్న నిప్పురవ్వ ఎగిరివచ్చి పడినా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అంతేకాకుండా, దగ్గర్లోనే వేలాది మంది విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాల కూడా ఉండటంతో స్థానికులు వణికిపోయారు. సమాచారం అందుకున్న సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, 2,700 లీటర్ల డీజిల్‌ను సీజ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదికను అదనపు కలెక్టర్‌కు సమర్పించారు. నిబంధనలు అతిక్రమించిన బంక్ యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన ‘నానో బనానా’

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల ‘కింగ్ కోబ్రా’.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

Follow Us