IT Rides: సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు..ఎన్ని కోట్ల ఆస్తులు గుర్తించారో తెలుసా?

మార్చి నెలలో ఓ ప్లాట్​ రిజిస్ట్రేషన్​ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్​ సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా మహమ్మద్​ పై ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదైంది. తస్లీమా ఇంటితో పాటు ఆమె బందువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏకకాలంలో ఆరు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీ ఎత్తున ఆస్తులు గుర్తించారు. తస్లీమాను మార్చి 22న అరెస్ట్ చేసి జైలు పంపింది అవినీతి నిరోధక శాఖ.

IT Rides: సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు..ఎన్ని కోట్ల ఆస్తులు గుర్తించారో తెలుసా?

|

Updated on: Apr 25, 2024 | 1:34 PM

మార్చి నెలలో ఓ ప్లాట్​ రిజిస్ట్రేషన్​ విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్​ సబ్​ రిజిస్ట్రార్​ తస్లీమా మహమ్మద్​ పై ఆదాయానికి మించి ఆస్తులు కేసు నమోదైంది. తస్లీమా ఇంటితో పాటు ఆమె బందువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏకకాలంలో ఆరు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీ ఎత్తున ఆస్తులు గుర్తించారు. తస్లీమాను మార్చి 22న అరెస్ట్ చేసి జైలు పంపింది అవినీతి నిరోధక శాఖ. అయితే, సరిగ్గా నెల రోజుల తరవాత ఆమె ఆస్తులపై విచారణ చేపట్టారు. తస్లీమా ఇంటితోపాటు ఆమె బంధువుల ఇళ్ళల్లోనూ సోదాలు చేశారు ఏసీబీ అధికారులు.

ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు డీఎస్పీ పి.సాంబయ్య నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. హనుమకొండ కాకతీయ కాలనీలోని తస్లీమాతో ఇంటితో పాటు ఆమె సోదరుల పేరుతో ఉన్న ఐదు ఇళ్ళు, సూర్యాపేటలోని ఆమె భర్త, భూపాలపల్లిలోని ఓ డాక్యుమెంట్​ రైటర్ ఇంట్లో ఏకకాలంలో సోదాలు చేశారు. మొత్తం ఆరు చోట్ల తనిఖీలు చేపట్టిన అధికారులు.. తస్లీమా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు నిర్ధారించారు. తన కుటుంబ సభ్యుల పేరున ఇళ్ళు, ల్యాండ్స్ కూడబెట్టినట్లు గుర్తించారు. తస్లీమా, ఆమె కుటుంబ సభ్యుల పేరున రూ.2 కోట్ల 7 లక్షల విలువైన ఐదు ఇళ్ళు, రూ.12 లక్షల విలువైన ఆరు ఇళ్ల స్థలాలు, ములుగులో రూ.20.40 లక్షల విలువైన మూడెకరాల వ్యవసాయ భూమి, రూ.1.92 లక్షల నగదు, రూ.98,787 బ్యాంక్​ బ్యాలెన్స్​, ఒక కియా కారు, రెండు బుల్లెట్​ బైకులు ఉన్నట్లు తేల్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వాటన్నింటి విలువ రూ.2.95 కోట్లు వరకు ఉంటుందని నిర్ధారించారు. ప్రస్తుతం తస్లీమా ఏసీబీ ట్రాప్​ కేసులో కరీంనగర్​ జైలులో ఉండగా, ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో విచారణ జరుపుతున్నామని, కోర్టు ఆదేశాల మేరకు ఆ తరువాతి చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య వివరించారు. సరిగ్గా నెల రోజుల తరువాత తస్లిమా ఇంట్లో సోదాలు జరగడం స్థానికంగా కలకలం రేపింది. సామాజిక కార్యకర్తగా, సబ్ రిజిస్ట్రార్ గా ప్రత్యేక ముద్ర వేసుకున్న తస్లీమాపై అవినీతి ఆరోపణలు ఆసక్తికర చర్చగా మారాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!

Follow us
Latest Articles
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే