దేవుళ్లకు ఐటీ షాక్‌.. పన్ను కట్టాలంటూ ఆలయాలకు నోటీసులు

|

Oct 07, 2023 | 9:10 AM

తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి తొలి స్థానంలో ఉన్నారు. 8 కోట్ల ఇన్కం ట్యాక్స్ కట్టాలని నోటీసులో తెలిపారు. సకాలంలో పన్ను కట్టకపోవడంతో మరో 3కోట్ల జరిమానా చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. బాసర సరస్వతీ ఆలయం, వేములవాడ రాజన్న ఆలయాలకు సైతం ఐటీ నోటీసులు అందినట్లు సమాచారం. 2016 -17 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంపై పన్ను కట్టాలని ఐటీ శాఖ ఈ ఆలయాలకు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి తొలి స్థానంలో ఉన్నారు. 8 కోట్ల ఇన్కం ట్యాక్స్ కట్టాలని నోటీసులో తెలిపారు. సకాలంలో పన్ను కట్టకపోవడంతో మరో 3కోట్ల జరిమానా చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. బాసర సరస్వతీ ఆలయం, వేములవాడ రాజన్న ఆలయాలకు సైతం ఐటీ నోటీసులు అందినట్లు సమాచారం. 2016 -17 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంపై పన్ను కట్టాలని ఐటీ శాఖ ఈ ఆలయాలకు నోటీసులు జారీ చేసింది. మల్లన్న ఆలయానికి ఐటీ నోటీసులపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. హిందూ ధర్మ పరిరక్షకులమని చెప్పుకునే బీజేపీ ఆలయాలకు నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించింది. మరోవైపు ఆలయాలకు ఐటీ నోటీసులు అందడంపై భక్తులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంభించడం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంతరిక్షంలో చెత్తకు రూ.1.24 కోట్ల జరిమానా..

వైట్‌హౌస్‌లో చెలరేగిపోతున్న బైడెన్ శునకం.. కొరికిపారేస్తుందిగా..

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు విలవిలలాడుతూ..

కడప లో కానిస్టేబుల్‌ క్రైమ్‌ కథాచిత్రం.. ఆరా తీయగా బయటపడ్డ షాకింగ్ నిజాలు

Balakrishna: చిత్రపరిశ్రమ మౌనంపై బాలయ్య రియాక్షన్‌