త్వరలో IRCTC సూపర్‌ యాప్‌ !! అన్ని సేవలు ఒకే చోట

|

Nov 08, 2024 | 1:09 PM

భారతీయ రైల్వే వ్యవస్థ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది ప్రయాణికులను తమ తమ గమ్య స్థానాలకు చేర్చుతోంది. రైళ్లలో ప్రయాణం చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. టికెట్ల బుకింగ్‌ కోసం ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్‌ తెలుసుకొనేందుకు వేర్వేరు యాప్‌లు వినియోగించాలి.

ఆ కష్టాలకు చెక్ పెడుతూ ఐఆర్‌సీటీసీ ఓ కొత్త సూపర్ యాప్‌ను తీసుకొస్తోంది. ఈ యాప్ ద్వారా అన్ని రకాల రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైల్వేశాఖకు సంబంధించి టికెట్స్‌ బుకింగ్‌, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, ట్రాకింగ్‌ స్టేటస్‌ కోసం రకరకాల యాప్స్‌ని ఉపయోగించడం ప్రయాణికులకు చాలా కష్టం అవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఇండియన్ రైల్వేస్ సరికొత్త సూపర్‌ యాప్‌ని తీసుకురాబోతోంది. ఇకపై ఈ యాప్‌లోనే టికెట్స్‌ బుకింగ్‌, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌, ట్రెయిన్‌ ట్రాకింగ్‌ చేసేందుకు వీలుంటుంది. అంతేకాదు రైలు ప్రయాణంలో ఫుడ్ ఆర్డర్ చేసుకునేందుకు కూడా ఈ యాప్ ఉపయోగపడుతుందట. ఇక, ప్లాట్‌ఫారమ్‌ టికెట్ నుంచి జనరల్‌ టికెట్‌ వరకు ఆన్‌లైన్‌ మోడ్‌లో కొనుగోలు చేసే వీలుంటుంది. డిసెంబర్ చివరి నాటి ఈ సూపర్ యాప్ అందుబాటులోకి వస్తుందట. ప్రస్తుతం ఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ను 10 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగిస్తున్నారు. ప్రస్తుతానికి ఇదే అత్యంత ప్రజాదరణ పొందిన రైల్వే యాప్‌గా నిలిచింది. రైల్ మదద్, యూటీఎస్, సటార్క్, టీఎమ్‌సీ-నిరీక్షన్‌, ఐఆర్‌సీటీసీ ఎయిర్, పోర్ట్‌రీడ్‌ వంటి యాప్‌లు కూడా రైల్వే సేవలను ప్రజలకు అందిస్తున్నాయి. వీటన్నింటిలోనూ ఉన్న సేవలను ఓకే సూపర్ యాప్ ద్వారా అందించేందుకు రైల్వే సిద్ధమవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మధురానగర్ ఆంజనేయస్వామి ఆలయంలో జాన్వీకపూర్ పూజలు

మొన్న సల్మాన్‌ ఖాన్‌.. ఇప్పుడు షారుక్‌ ఖాన్‌

అవునా.. నిజమేనా !! అభిషేక్‌-ఐశ్వర్యలపై వైరల్‌ న్యూస్‌

Follow us on