Tirumala: తిరుమల నడకమార్గాల్లో ఫెన్సింగ్ నిర్మాణం..? భక్తుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత.
ఇటీవల తిరమల నడకమార్గాల్లో చిరుతపులులు, ఎలుగుబంట్లు భక్తులపై దాడులకు పాల్పడుతుండటంతో ఇటు జంతువుకు, అటు భక్తులకు రక్షణ కల్పించే విధంగా చర్యలకు శ్రీకారం చుట్టుంది టీటీడీ అటవీశాఖ. యానిమల్స్ ఫ్రీపాసింగ్ కోసం ఎలివేటెడ్ వాక్ వేస్, ఏరియల్ ఫుట్ పాత్ ల నిర్మాణాలపై సాధ్యా సాధ్యాలపై సర్వే చేపట్టింది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గాల్లో జంతువుల సంచారంపై ఆరా తీసిన వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ టీమ్ ఈ మేరకు నివేదిక ఇవ్వనుంది.
ఇటీవల తిరమల నడకమార్గాల్లో చిరుతపులులు, ఎలుగుబంట్లు భక్తులపై దాడులకు పాల్పడుతుండటంతో ఇటు జంతువుకు, అటు భక్తులకు రక్షణ కల్పించే విధంగా చర్యలకు శ్రీకారం చుట్టుంది టీటీడీ అటవీశాఖ. యానిమల్స్ ఫ్రీపాసింగ్ కోసం ఎలివేటెడ్ వాక్ వేస్, ఏరియల్ ఫుట్ పాత్ ల నిర్మాణాలపై సాధ్యా సాధ్యాలపై సర్వే చేపట్టింది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అలిపిరి, శ్రీవారిమెట్ల మార్గాల్లో జంతువుల సంచారంపై ఆరా తీసిన వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ టీమ్ ఈ మేరకు నివేదిక ఇవ్వనుంది. గత జూన్ 23 న అలిపిరి నడక మార్గంలోని 7వ మైలు వద్ద 5 ఏళ్ల కౌశిక్ పై చిరుతదాడి ఆ తర్వాత నరసింహస్వామి ఆలయం వద్ద ఆగస్టు 11న లక్షితపై చిరుత దాడి చేసి చంపిన ఘటనలు భక్తులను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో నడక మార్గంలో భక్తులకు భయం లేకుండా తిరుమల యాత్ర కొనసాగేలా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు టిటిడి, అటవీ శాఖ అధికారులు. ఓ వైపు భక్తుల భద్రత, మరోవైపు వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ స్వల్పకాలిక, దీర్ఘకాళిక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే సెక్యూరిటీ పెంచడం, నడక మార్గంలో ఆంక్షలు విధించడం, భక్తులకు చేతి కర్రలు ఇవ్వడం లాంటి చర్యలు చేపట్టాయి. కాలిబాటకు దగ్గర లో 50 మీటర్ల దూరంలోనే 500 దాకా కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసిన అటవీ శాఖ దాదాపు 150 మంది సిబ్బందితో నిరంతర నిఘా కొనసాగిస్తోంది. చిరుతలను బంధించి వాటిని సురక్షిత ప్రాంతాల్లో ఉంచుతోంది.
ఇక దీర్ఘకాలిక చర్యలు చేపట్టేందుకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సంప్రదించిందిన టీటీడీ.. అనిమల్స్ ఫ్రీ పాసింగ్‌తోపాటు డిజైన్స్, స్ట్రక్చర్స్ తదితర విషయాలపై కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతి పొందేందుకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేత సర్వే చేయిస్తోంది. ఇందులో భాగంగా డెహ్రాడూన్ నుంచి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు చెందిన ముగ్గురు సైంటిస్టుల బృందం తిరుమల నడక మార్గంలో అధ్యయనం ప్రారంభించింది. అలిపిరి నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. కౌశిక్ లక్షిత లపై చిరుతలు దాడి చేసిన ప్రాంతాలను, 6 చిరుతలను బంధించిన ప్రాంతాలను పరిశీలించిన సైంటిస్ట్ ల బృందం పెన్షింగ్, అండర్ పాస్, ఓవర్ పాస్ లాంటి శాశ్వత నిర్మాణాలతో చేపట్టాల్సిన పనులపై డాక్టర్ కే రమేష్, అశుతోష్ సింగ్, ప్రశాంత్ మహాజన్ లు టీటీడీ, రాష్ట్ర అడివిశాఖ అధికారులతో చర్చించారు. అనిమల్స్ ఫ్రీ పాసింగ్ కు ఇబ్బంది లేకుండా అండర్ పాస్, ఓవర్ పాస్ నిర్మాణాలు, ఫెన్సింగ్ పనులు చేపట్టేందుకు వీలున్నట్లు ప్రాథమికంగా భావించింది. ఈ మేరకు టీటీడీకి నివేదిక ఇవ్వనుంది. ఈ మేరకు సెప్టెంబర్ 29న తిరుమల ఎన్ క్లోజర్, శ్రీవారి మెట్టు మార్గం, ఎస్వీ జూ పార్క్ ను పరిశీలించనున్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కు చెందిన సైంటిస్ట్ టీం అధ్యయనం కొనసాగించనుంది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక తో పాటు హైదరాబాద్ కు చెందిన ఐటీ కోర్ సంస్థ, డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ లకు చెందిన ఎక్స్‌పర్ట్స్ కమిటీ నివేదికలు ఆధారంగా నడక మార్గంలో మార్పులు చేయాలని టీటీడీ భావిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..