బిగ్ అలర్ట్.. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే మూడిందే.. తరువాత ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు..
మీరు చూడటానికి సన్నగా ఉన్న మీకు ఒబిసిటీ సమస్య ఉండవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో 20 శాతం మంది ఊబకాయం ,ఒబిసిటీ సమస్యతో బాధపడుతున్నారు. 2030, 2050 కల్లా అమెరికా యూకే లాగా 40 నుంచి 50% ఒబిసిటీ సమస్యలతో దేశం బాధపడే ప్రమాదముంది. ఇదే జరిగితే దేశంలో ప్రొడక్టివ్ పాపులేషన్ తగ్గిపోతుంది.
దేశానికి వెన్నుముకగా ఉండాల్సిన యువత అనారోగ్య సమస్యలతో బాధపడే ప్రమాదం ఉంది. బయట షాపుల్లో కొనుక్కుని తినే చిప్స్ లాంటి జంక్ ఫుడ్స్ ప్యాకెట్ ఫుడ్స్ మీద సాల్ట్ షుగర్ ఫ్యాట్ ఇండికేషన్స్ ముద్రించాలనేది ప్రభుత్వం అబ్జర్వేషన్ లో ఉంది. ఏకంగా ప్రధాని మోదీనే భారత దేశంలో ఫ్యాట్ అధికంగా వినియోగంలో ఉంది మీరు తీసుకునే ఫ్యాట్‌లో 10% తగ్గించండి అని సూచన చేశారు. టీవీ9 తో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సీనియర్ సైంటిస్ట్ సుబ్బారావు మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరిగిన రీసెర్చ్ లో ఒబేసిటీ ఉబకాయం చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నట్టుగా అధ్యయనాలు తేల్చాయి. లైఫ్ స్టైల్ లో మార్పు, శారీరక శ్రమ తగ్గిపోవడం, స్ట్రెస్ పెరగటం, నిద్రలేమి, అధికంగా మొబైల్ వినియోగం లాంటి కారణాలు అధికమయ్యాయి. షుగరు సాల్ట్ ఫ్యాట్ అధిక మోతాదులో తీసుకోవటం ఒబెసిటీకి కారణం. అందుకనే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో షుగర్ సాల్ట్ ఫ్యాట్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచన చేయటం జరిగింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రతిరోజు 5 టీ స్పూన్స్ అంటే 25 గ్రాముల షుగర్ తీసుకోవచ్చు. అసలు షుగర్‌ను పూర్తిగా అవైడ్ చేస్తే చాలా మంచిది. షుగర్ కు బదులుగా తాటి బెల్లం, బెల్లం, తేనె బెటర్ అనుకుంటాం కానీ షుగర్ ఎంత ప్రమాదమో అవి కూడా అంతే స్థాయిలో ప్రమాదం. 100 గ్రాముల చాక్లెట్స్ లో 11 టీ స్పూన్స్, అదే 100 గ్రాముల గులాబ్ జామ్ లో 11 టీ స్పూన్స్ షుగర్ ఉంటుంది. 100 గ్రాముల జిలేబిలో 8 టీ స్పూన్లు 100 ఎంఎల్ కూల్డ్రింక్ లో ఆరు టీ స్పూన్ల షుగర్ బాడీ లోకి వెళ్తుంది. ఇది పరిమిత స్థాయి కంటే కచ్చితంగా అధిక మోతాదు. పిజ్జా, పేస్ట్రీ, కుకీస్, బ్రెడ్, చీజ్, సమోసా , మయోనీస్ వీటన్నింటిలో ఫ్యాట్ అధిక మోతాదులో ఉంటుంది ఒక మనిషి సగటున 30 గ్రాములకు మించిన ఆయిల్ ఇంటెక్ తీసుకోకూడదు. హై షుగర్ ఫ్యాక్ సాల్ట్ ఇవన్నీ ఒక ఫుడ్ ను రుచికరంగా తయారు చేస్తాయి కానీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి ఇండస్ట్రియల్ లెవెల్లో ప్యాక్డ్ ఫుడ్ తయారు చేస్తున్నప్పుడు రుచి కోసం వీటన్నిటిని ఎక్కువ మోతాదులో వాడుతారు ఇది ప్రమాదకరం. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవు. భవిష్యత్తులో రక్త పోటు మధుమేహం ఒబేసిటీ క్యాన్సర్ గుండెజబ్బు సమస్యలతో దేశం బాధపడే పరిస్థితులు ఉంటాయి. గత 30 ఏళ్లలో లలో అండర్ న్యూట్రిషన్ సమస్య నుంచి ఓవర్ న్యూట్రిషన్ సమస్యకు పరిస్థితులు మారుతున్నాయి ఒబెసిటీ సమస్యలతో వ్యక్తిగత అభివృద్ధితోపాటు దేశ అభివృద్ధి కూడా కుంటుపడే ప్రమాదముంది..
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గూగుల్ తీసిన నగ్న ఫోటో.. కోర్టుకెళ్తే రూ.10 లక్షల నష్ట పరిహారం
నడి రోడ్డుపై బుస్సుమన్న నాగ పాము.. చూసిన జనాలు పరుగో పరుగు
ఏం సినిమా రా బాబూ.. రూ. 17,400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు ప్రపంచ బాక్సాఫీస్ షేక్