భారీ వర్షంలోనూ పరేడ్‌.. ఆసక్తిగా తిలకించిన జనం

Updated on: Jan 25, 2026 | 5:49 PM

ఢిల్లీలో అకాల వర్షాలు, పొగమంచు మధ్య గణతంత్ర దినోత్సవ పూర్తిస్థాయి రిహార్సల్ విజయవంతంగా పూర్తయింది. కర్తవ్యపథంపై త్రివిధ దళాలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తమ కవాతును ప్రదర్శించాయి. ప్రేక్షకులు దేశభక్తితో తడిసినా, ఆలస్యం అయినా తిలకించారు. జనవరి 26న జరగబోయే ప్రధాన కవాతుకు ఇది ఒక సూచన. భారతదేశ సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే ఈ ప్రదర్శన దేశ ప్రజలలో స్ఫూర్తిని నింపుతుంది.

అకాల వర్షాలు, మేఘావృతమైన ఆకాశం ఫుల్ డ్రెస్ రిహార్సల్‌ కి ఆటంకాలు కలిగించాయి. వాతావరణంలో ఆకస్మిక మార్పుతో ఆలస్యంగానైనా రిహార్సల్స్‌ని పూర్తి చేసారు. భద్రతా సిబ్బంది, ఢిల్లీ స్థానికులు కర్తవ్య మార్గం దగ్గర వర్షంలో తడుస్తూ ఇబ్బంది పడ్డారు. అయితే త్రివిధ దళాలు.. వర్షంలోనే రిహార్సల్ చెయ్యడం గొప్ప విషయం. వర్షం ధారగా కురవడంతో రిహార్సల్ షెడ్యూల్ ప్రకారం కాకుండా కాస్త ఆలస్యంగా మొదలైంది. ప్రేక్షకులు రెయిన్ కోట్లు, శాలువాలు ధరించి రిహార్సల్ ను చూసారు. ఎంత వర్షం పడినా.. ఎట్టి పరిస్థితుల్లో రిహార్సల్ చూడాల్సిందే అని వారు బలంగా డిసైడ్ అయ్యారు. అది వారిలోని దేశ భక్తిని చాటుతోంది. జనవరి 26న ప్రధాన కవాతుకు ఉపయోగించే మార్గంలోనే ఈ రిహార్సల్ జరిగింది. దీన్ని చూడటం ద్వారా.. అసలు ప్రదర్శన ఎలా ఉంటుందో.. ప్రేక్షకులకు అర్థమైంది. దేశ ప్రజల కంటే ముందే తాము రిపబ్లిక్ డే పరేడ్‌ని చూసామని గర్వంగా ఫీలయ్యారు. ముఖ్యంగా ఇండియా.. ప్రపంచ అతి పెద్ద సైనిక శక్తి గల దేశాల్లో ఒకటిగా నిలిచింది. శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించడం లక్ష్యంగా పరేడ్‌లో మన శక్తి సామర్ధ్యాల ప్రదర్శన ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పడిపోయినా వదల్లేదు.. రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్లు

రైల్వేలో రోబో క్యాప్‌.. విధుల్లోకి అర్జున్‌

షారుఖ్ చేతికి రూ.13 కోట్ల వాచ్.. ఏమిటీ దీని స్పెషాలిటీ ??

కంటి ఆపరేషన్లు చేసే రోబో.. చైనా పరిశోధకుల అద్భుత సృష్టి

జైలుకెళ్లిన భర్తను బెయిలుపై బయటకు తెచ్చి మరీ