ఇండియా రక్షణ వ్యవస్థకు బూస్ట్.. ధ్వని క్షిపణి
భారత రక్షణ వ్యవస్థకు ధ్వని క్షిపణి (HGV) తో సరికొత్త బలం చేకూరనుంది. బ్రహ్మోస్ కంటే శక్తివంతమైన ఈ హైపర్ సోనిక్ క్షిపణి, శత్రు దేశాల రక్షణ వ్యవస్థలను ఛేదించగలదు. శబ్ద వేగానికి ఐదారు రెట్లు అధిక వేగంతో, గంటకు దాదాపు 7000 కిలోమీటర్ల వేగంతో 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
భారత రక్షణ వ్యవస్థ బ్రహ్మోస్ క్షిపణిని దాని బాహుబలిగా పేర్కొంటున్న సమయంలో, ఇప్పుడు దానికంటే శక్తివంతమైన ధ్వని క్షిపణి (హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ – HGV) భారత సైన్యంలో చేరనుంది. శత్రు దేశాల రక్షణ వ్యవస్థలకు దడ పుట్టించే ఈ శక్తిమాన్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి చివరి పరీక్షలను పూర్తి చేసుకుని, ఆర్మీకి అందుబాటులోకి రానుంది. రక్షణ వ్యవస్థలో డీఆర్‌డీఓ నిరంతరం అధునాతన క్షిపణి వ్యవస్థలు, ఫైటర్ జెట్‌లు, డ్రోన్ల ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే హైపర్ సోనిక్ మిస్సైల్స్ ప్రయోగాలను వేగవంతం చేసింది. ధ్వని క్షిపణి అత్యంత వేగంగా ప్రయాణించడం, సుదూర లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించగలగడం దీని ప్రధాన ప్రత్యేకత.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పండగ పూట.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో కదలిక
రన్‌వే పై రెండు విమానాలు ఢీ.. వీడియో వైరల్
