గంటకు 400 కి.మీ వేగంఈ రైళ్లేనా భారత్‌కు రానుంది
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి జపాన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ ను పరిశీలించారు ప్రధాని మోదీ. కొత్తగా పట్టాలెక్కిన బుల్లెట్ ట్రైన్ ALFA-X train లో జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి మోదీ ప్రయాణించారు. రాజధాని టోక్యో నుంచి సెండాయ్ మధ్య నడిచే ఆ రైలు పనితీరు, గరిష్ఠ వేగం, మెయింటెనెన్స్, నిర్వహణ ఖర్చు.. వంటి అంశాలపై ప్రధాని మోదీ ఆరా తీశారు.
ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టుపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ అభివృద్ధి చేస్తున్న ‘ఈ–10’ షింకన్సెన్ బుల్లెట్ రైలు 2030లో పట్టాలెక్కనుంది. గంటకు 400 కిలోమీటర్ల వేగం ఈ ట్రైన్ ప్రత్యేకత. ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టు గుజరాత్, మహారాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీల గుండా 508 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారిడార్‌లో 12 స్టేషన్లు ఉండగా, వీటిలో 4 మహారాష్ట్రలో, 8 గుజరాత్‌లో రానున్నాయి. ముంబై- సబర్మతికి మధ్య గల 508 కి.మీ దూరాన్ని ఈ రైలు 80 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. గతంలో కుదిరిన ఒప్పందంలో భాగంగా జపాన్ ప్రభుత్వం ‘ఈ–5’ షింకన్సెన్ బుల్లెట్ రైళ్లను భారత్‌కు అందించాల్సి ఉంది. అయితే, ఇప్పుడు అత్యాధునిక ‘ఈ–10’ రైళ్లనే జపాన్ మనకు అందించనుంది. ఇవి జపాన్ తోపాటు భారత్‌లోనూ 2030 ప్రారంభం నాటికి రానున్నాయి. ‘ఈ–5’ బుల్లెట్ ట్రైన్ వేగం గంటకు గరిష్టంగా 320 కి.మీ. కాగా, ఈ–10 రైలు వేగం 400 కి.మీ. ఈ రైళ్లను భారత్‌లోనూ తయారు చేసే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో ఈసారి నెలముందే ఇంటర్ పరీక్షలు
Donald Trump: కాలు తీసేయాల్సి రావొచ్చు..ట్రంప్ హెల్త్‌పై డాక్టర్ సంచలనం
వీధి శునకాలపై ప్రేమ.. చెంప దెబ్బలకూ వెనకాడని మహిళ