నేపాల్‌లో హోటల్‌కు నిప్పు.. భారత మహిళ మృతి వీడియో

Updated on: Sep 14, 2025 | 4:54 PM

నేపాల్‌లో జెన్ జీ ఉద్యమం హింసాత్మకంగా మారింది . ఆగ్రహంతో రగిలిపోయిన యువత ఏకంగా ప్రధానమంత్రి కేపీ ఓలీ అధికారిక నివాసానికే నిప్పు పెట్టారు. ఈ సమయంలో మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ రాజధాని కాట్మండులోని హయత్‌ హోటల్‌కు నిరసనకారులు నిప్పుపెట్టారు. దీంతో ఓ భారతీయ జంట.. మంటల నుంచి తప్పించుకునేందుకు నాలుగో అంతస్తు కిటికీ నుంచి దూకారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

మృతి చెందిన మహిళను డెహ్రాడూన్‌ చెందిన 55 ఏళ్ల రాజేష్ దేవి గోలాగా గుర్తించారు. పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించడానికి ఆమె తన భర్త రామ్‌వీర్ సింగ్ తో కలిసి కాట్మండుకు వెళ్లారు. రామ్‌వీర్ వృత్తిరీత్యా ట్రాన్స్‌పోర్టర్. గురువారం ఈ దంపతులు హిల్టన్ హోటల్‌లో బస చేశారు. నిరసనకారులు ఆ భవనానికి నిప్పంటించడంతో తప్పించుకునే క్రమంలో భవనం నుంచి దూకారు. హోటల్‌ భవనం నుంచి కిందకు దూకమని నేల మీద పరుపులు పరిచామని ఎలాంటి భయం అవసరం లేదని చెప్పడంతో సాహసం చేసారు. కానీ అంతెత్తు నుంచి కింద పడటంతో ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తిరుగు ప్రయాణ పర్వం మొదలైంది. పలు మార్గాల్లో పలు రాష్ట్రాల ప్రజలు వెనుతిరిగి వస్తున్నారు. నేపాల్‌లో క్రమంగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికారులు కర్ఫ్యూ ఆంక్షలను ఎత్తివేశారు.

మరిన్ని వీడియోల కోసం :

దూసుకెళ్తున్న రైల్లోంచి దూకేసిన నటి.. ఎందుకో తెలుసా వీడియో

టూరిస్ట్ స్పాట్ గా పబ్లిక్ టాయిలెట్… కారణం ఇదే వీడియో

153 వంతెనలు, 45 సొరంగాలు..కొండలను చీలుస్తూ వెళ్లే రైలును చూసారా? వీడియో