AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తను హత్య చేసి.. పరిహారం కోసం.. పులి చంపిందని.. వీడియో

భర్తను హత్య చేసి.. పరిహారం కోసం.. పులి చంపిందని.. వీడియో

Samatha J
|

Updated on: Sep 14, 2025 | 4:54 PM

Share

ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. పరిహారం కోసం పులి దాడిలో మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని పేడ కుప్ప నుంచి బయటకు తీశారు. కర్ణాటకలోని మైసూరు జిల్లా హెజ్జూర్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల వెంకటస్వామి, సల్లపురి భార్యాభర్తలు. అరెకా గింజ తోటల్లో కూలీలుగా వారు పనిచేస్తున్నారు.

సెప్టెంబర్‌ 8న హెజ్జూర్ గ్రామంలో ఒక పులి కనిపించింది. అటవీ జంతువుల దాడి బాధితులకు ప్రభుత్వం 15 లక్షల రూపాయల పరిహారం ఇస్తుందని తోటి కూలీలు మాట్లాడుకోవడాన్ని సల్లపురి వినింది. దాంతో భారీ పరిహారం కోసం భర్తను హత్య చేయాలని ప్లాన్‌ చేసింది. ఆహారంలో విషం కలిపి భర్త వెంకటస్వామిని హత్య చేసింది. ఇంటి వెనుక పేడ కుప్పలో మృతదేహాన్ని దాచింది.మరోవైపు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త అదృశ్యమయ్యాడని ఆ మహిళ కన్నీరు కార్చింది. గ్రామంలో తిరుగుతున్న పులి అతడ్ని ఈడ్చుకెళ్లి చంపి ఉంటుందని పోలీసుల వద్ద గగ్గోలు పెట్టింది. దీంతో అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు కలిసి ఆమెతో పాటు జోరు వానలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. అయితే వెంకటస్వామి అదృశ్యమైనట్లు భార్య చెప్పిన ప్రాంతంలో అతడి మృతదేహం లభించలేదు. చివరకు అనుమానంతో వెంకటస్వామి ఇంటి పరిసరాల్లో వెతికారు. పేడ కుప్పలో దాచిన అతడి మృతదేహాన్ని బయటకు తీశారు.

మరిన్ని వీడియోల కోసం :

దూసుకెళ్తున్న రైల్లోంచి దూకేసిన నటి.. ఎందుకో తెలుసా వీడియో

టూరిస్ట్ స్పాట్ గా పబ్లిక్ టాయిలెట్… కారణం ఇదే వీడియో

153 వంతెనలు, 45 సొరంగాలు..కొండలను చీలుస్తూ వెళ్లే రైలును చూసారా? వీడియో

Published on: Sep 14, 2025 04:53 PM