“అమ్మా.. తిరిగి వస్తానో లేదో తెలీదు” రెస్క్యూ మిషన్‌కు ముందు పైలెట్ మాటలు

Updated on: Mar 13, 2026 | 5:00 PM

ఫరీదాబాద్ పైలట్ దీపికా అధానా గల్ఫ్ దేశంలో చిక్కుకున్న 169 మంది భారతీయులను ప్రాణాలకు తెగించి రక్షించింది. యుద్ధ వాతావరణంలో, ప్రమాదకర గగనతలంలో విమానం నడిపి, సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. తన కూతురు ధైర్యాన్ని చూసి తల్లి బాబ్లీ అధానా గర్వపడింది. మాతృభూమి కోసం దీపిక చేసిన సాహసం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది.

ఫరీదాబాద్ యువతి 23 ఏళ్ల దీపికా అధానా.. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న మనవాళ్లను రక్షించేందుకు మృత్యువుతో పోరాడింది. తిరిగి వస్తానో లేదో తెలియననే మాటలను తల్లికి చెబుతూనే యుద్ధానికి సిద్ధమైంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కి పైలట్‌గా యూఏఈ వెళ్లి మరీ అక్కడ చిక్కుకున్న 169 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. వచ్చిన వెంటనే తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పగా.. ఆమె తన కూతురు ధైర్యం చూసి మురిసిపోయారు. ఇంత మంది ప్రాణాలను తన కూతురు కాపాడడం గర్వంగా ఉందంటూ ఆనంద భాష్పాలు కార్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ.. తన ప్రాణాలకు తెగించి మాతృభూమి కోసం నిలబడింది 23 ఏళ్ల పైలెట్. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులు చేస్తుండగా… గగనతలం ప్రమాదకరంగా మారింది. యూఏఈలో చిక్కుకుపోయిన 169 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చి వార్తల్లో నిలిచింది ఫరీదాబాద్‌కు చెందిన పైలట్ దీపికా అధానా. అయితే ఆమె ఈ రెస్య్కూ ఆపరేషన్ చేపట్టడానికి ముందు తన తల్లికి చేసిన మెసేజ్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో పైలట్‌గా పని చేస్తున్న 23 ఏళ్ల దీపికకు మార్చి 6 ఉదయం 10 గంటలకు కాల్‌ వచ్చింది. యూఏఈలోని రాస్ అల్ ఖైమాకు వెళ్లి అక్కడ చిక్కుకున్న 169 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చాలని అధికారులు సూచించారు. అయితే నిజానికి ఆ విమానాన్ని ఆమె స్నేహితురాలు నడపాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఆ బాధ్యత దీపికపై పడింది. యుద్ధం భీకరంగా సాగుతున్న ప్రాంతం కావడంతో.. బయలుదేరే ముందు ఆమె తన తల్లితో అన్న మాటలు గుండెల్ని పిండేసేలా ఉన్నాయి. “అమ్మా.. బై బై. నేను తిరిగి వస్తానో లేదో కూడా నాకు తెలియదు” అని చెప్పి ఆమె విమానం ఎక్కింది. ఆరుగురు మహిళా సిబ్బందితో ఈ విమానం రాస్ అల్ ఖైమా చేరుకుంది. అయితే తిరుగు ప్రయాణంలో ఒక భయంకరమైన క్షణం ఎదురైంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి. ధైర్యం కోల్పోకుండా దీపికా బృందం విమానాన్ని నడిపింది. కొద్ది నిమిషాల తర్వాత మళ్లీ కమ్యూనికేషన్ పునరుద్ధరించబడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా అనేక సవాళ్ల మధ్యే 169 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చారు. వచ్చిన వెంటనే తన తల్లికి ఫోన్ చేసి సురక్షితంగానే ఇండియా చేరుకున్నట్లు చెప్పగా.. ఆమె తల్లి, కుటుంబ సభ్యులు అంతా తెగ సంబరపడిపోయారు. ముఖ్యంగా ఆమె తల్లి బాబ్లీ అధానా మాట్లాడుతూ “నా బిడ్డ ఇంతమంది ప్రాణాలు కాపాడినందుకు చాలా గర్వంగా ఉంది” అని మురిసిపోయారు. 2020లో ఇంటర్ పూర్తి చేసిన దీపిక.. కోవిడ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడి ఇంటి నుంచే చదువుకుని కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించింది. ఆ తర్వాత గ్రీస్, ఇస్తాంబుల్‌లో శిక్షణ పొంది ఎయిర్ బస్ A320 విమానాలను నడపడంలో నైపుణ్యం సంపాదించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటగాళ్లను అందాలతో.. క్లీన్ బౌల్డ్ చేస్తున్న హీరోయిన్లు..

Pinarayi Vijayan: మెగాస్టార్‌కు బహిరంగ క్షమాపణ చెప్పిన.. కేరళ సీఎం

Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్

The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..

Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ

Follow Us