Indian Army: నా బిడ్డను కాపాడండి.. సైన్యానికి ఓ వ్యక్తి ఫోన్‌..! ఇండియన్ ఆర్మీ చేసిన సాహసమే వేరు.. వీడియో.

|

Feb 02, 2023 | 9:27 PM

బార్డర్‌లోనే కాదు.. మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలకు కష్టం వచ్చిందంటే చాలు..క్షణాల్లో వచ్చి సాయం చేస్తుంది భారత సైన్యం. అందుకు మరో ప్రత్యక్ష సాక్ష్యమే ఈ సంఘటన. జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని మారుమూల గ్రామంలో

బార్డర్‌లోనే కాదు.. మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలకు కష్టం వచ్చిందంటే చాలు..క్షణాల్లో వచ్చి సాయం చేస్తుంది భారత సైన్యం. అందుకు మరో ప్రత్యక్ష సాక్ష్యమే ఈ సంఘటన. జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని మారుమూల గ్రామంలో అపస్మారక స్థితిలో ఉన్న 19 ఏళ్ల యువతిని రక్షించారు భారత సైనికులు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఎముకలు గడ్డకట్టే చలిలో స్పృహ తప్పి పడిపోయింది యువతి. అయితే పోరాటం తర్వాత సైన్యం బాలికను బయటకు తీసుకువెళ్లింది. “యురి సెక్టార్‌లోని బోనియార్ తహసీల్‌లోని కురలి గ్రామానికి చెందిన యువతి ప్రవీణా బానోని ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ సిబ్బంది అత్యవసరంగా తరలించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. ఈ మేరకు ఆర్మీ అధికారి ఒకరు వివరాలు వెల్లడించారు.సుమ్‌వాలి గ్రామ నివాసి ఒకరు భారత సైన్యానికి అత్యవసర కాల్ చేశాడు. తన కూతురిని ఎలాగైన రక్షించి బయటకు తీసుకురావాలని ఆ వ్యక్తి వేడుకున్నాడు. బాలిక కురలి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే అస్వస్థతకు గురైపడిపోయిందని చెప్పారు. ప్రస్తుతం బారాముల్లాలో విపరీతమైన మంచు కురుస్తోంది. దీని కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ఇలాంటి స్థితిలో ఆ యువతి తండ్రి చేసిన ఫోన్‌కాల్‌కు సైనికులు వేగంగా స్పందించారు. తక్షణ వైద్య సహాయం అందించారు. యువతిని బోనియార్ హెల్త్ సెంటర్‌కు తరలించేందుకు ఆర్మీ బృందం వాహనాన్ని పంపింది. దీంతో ఆర్మీ సిబ్బందిని గ్రామస్తులు మెచ్చుకున్నారు. వారి మనవతా దృక్పథాన్ని ప్రజలు అభినందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on