C-295 Aircraft: భారత వాయుసేనలోకి మరో బ్రాహ్మాస్త్రం !!

|

Sep 14, 2023 | 9:02 PM

మరో అత్యాధునిక విమానం.. భార‌తీయ వైమానిక ద‌ళంలో చేరింది. స్పెయిన్‌లోని సివిల్లేలో కొత్త ట్రాన్స్‌పోర్టు విమానాన్ని భారత్‌కు అంద‌జేశారు. ఎయిర్‌బ‌స్ సంస్థ నుంచి ఆ విమానాన్ని ఐఏఎఫ్‌ తీసుకుంది. సీ-295 వ‌ర్గానికి చెందిన ట్రాన్స్‌పోర్టు విమానాన్ని వైమానిక ద‌ళం రిసీవ్ చేసుకోవ‌డం ఇదే మొద‌టిసారి. ఎయిర్‌బ‌స్ సంస్థకు చెందిన డిఫెన్స్ హెడ్ జీన్ బ్రీస్ డూమంట్ సీ295 విమానాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ వీర్ చౌద‌రీకు అంద‌జేశారు.

మరో అత్యాధునిక విమానం.. భార‌తీయ వైమానిక ద‌ళంలో చేరింది. స్పెయిన్‌లోని సివిల్లేలో కొత్త ట్రాన్స్‌పోర్టు విమానాన్ని భారత్‌కు అంద‌జేశారు. ఎయిర్‌బ‌స్ సంస్థ నుంచి ఆ విమానాన్ని ఐఏఎఫ్‌ తీసుకుంది. సీ-295 వ‌ర్గానికి చెందిన ట్రాన్స్‌పోర్టు విమానాన్ని వైమానిక ద‌ళం రిసీవ్ చేసుకోవ‌డం ఇదే మొద‌టిసారి. ఎయిర్‌బ‌స్ సంస్థకు చెందిన డిఫెన్స్ హెడ్ జీన్ బ్రీస్ డూమంట్ సీ295 విమానాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ వీర్ చౌద‌రీకు అంద‌జేశారు. ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌద‌రీ ఆ కీస్ అందుకున్నారు. సీ-295 ర‌కానికి చెందిన 56 ట్రాన్స్‌పోర్టు విమానాల‌ను కొనుగోలు చేయాల‌ని సుమారు 21 వేల కోట్లతో గతంలో ఎయిర్ బస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది భారత ప్రభుత్వం. ఇందులో భాగంగానే తొలి విమానాన్ని అప్పగించారు. స్పెయిన్‌లో 16 విమానాల‌ను అంద‌జేస్తారు. మిగిలిన 40 విమానాల‌ను.. వ‌డోద‌ర‌లో త‌యారు చేయ‌నున్నారు. చాలా త‌క్కువ ర‌న్‌వేపై టేకాఫ్‌, ల్యాండింగ్ చేయ‌గ‌ల సామ‌ర్థ్యం సీ-295 విమానంకు ఉంది. యూపీలోని ఘ‌జియాబాద్‌లో ఉన్న హిండ‌న్ ఎయిర్‌బేస్‌కు సీ-295 విమానం రానుంది. సెప్టెంబ‌ర్ 25వ తేదీన ఆ విమానం ల్యాండ్ అయ్యే ఛాన్సు ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వావ్‌ !! వాటే క్రియేటివిటీ.. ఆరవై ఏళ్ల వయసులో అద్భుత సృష్టి

పిల్లలకు ఇంట్లో కమ్మగా వండి పెట్టండి… కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

తలకు సవరం.. భార్య డ్రెస్ వేసి అమ్మాయిలా మారాడు.. చివరకు ??

Ram Charan-Upasasana: మ్యాచింగ్ దుస్తుల్లో అదరగొట్టిన రామ్ చరణ్, ఉపాసన

విమానం టాయిలెట్‌లో ఇదేం పాడు పని !! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో