భారత్, ఇంగ్లండ్‌ టెస్ట్‌ మ్యాచ్‌.. 2 వేలమందికి ఫ్రీ ఎంట్రీ

|

Jan 13, 2024 | 9:08 PM

నాలుగేళ్ల తర్వాత విశాఖ లోని VDCA-YSR ACA ఇంటర్నేషనల్ స్టేడియం లో అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 2 నుంచి 6 తేదీ వరకు భారత్‌ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్ వివరాలను వెల్లడించింది. ఈ సారి ప్రత్యేకంగా రోజుకు 2000 మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించింది .

నాలుగేళ్ల తర్వాత విశాఖ లోని VDCA-YSR ACA ఇంటర్నేషనల్ స్టేడియం లో అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 2 నుంచి 6 తేదీ వరకు భారత్‌ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్ వివరాలను వెల్లడించింది. ఈ సారి ప్రత్యేకంగా రోజుకు 2000 మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించింది . మ్యాచ్‌ నిర్వాహక కమిటీ గురువారం స్టేడియంలో సమావేశమైంది. నిర్వాహక కమిటీ చైర్మన్, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున దీనికి సంబంధించి వివరాలను వెల్లడిస్తూ మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చే దేశ, విదేశీ అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మూడంచెల పటిష్ట భద్రతతో పాటు తాగునీరు, మెడికల్‌ సదుపాయాలు, తగినన్ని స్టాల్స్‌ ఏర్పాటు చేస్తామని, ఉల్లాసభరిత వాతావరణం లో మ్యాచ్ చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే క్రికెట్ ప్రేమికుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలను అందుబాటులో ఉంచుతామన్నారు ACA అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథరెడ్డి. టెస్ట్ మ్యాచ్ టికెట్ల విక్రయం జనవరి 15 నుంచి ప్రారంభం అవుతుందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీకు గ్యాస్‌ కనెక్షన్‌ ఉందా ?? అయితే రూ.50 లక్షల ఇన్సూరెన్స్ గురించి తెలుసా ??

కోనసీమలో ముందే వచ్చిన సంక్రాంతి.. సందడిగా వేడుకలు

రామ భక్తులకు గుడ్ న్యూస్.. అయోధ్యకు ఫ్రీ రైలు

అయోధ్య రామునికి 44 క్వింటాళ్ల నేతి లడ్డూల కానుక

విమానం డోర్‌ ఓపెన్‌చేసి దూకేసిన ప్రయాణికుడు