Gold Prices: మరోసారి ఆల్ టైం హైకి చేరిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Updated on: Sep 16, 2025 | 9:13 PM

దేశంలో బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,000 దాటింది. ఇది 2020తో పోలిస్తే 140% పెరిగినట్టు తెలుస్తోంది. అమెరికాలోని వడ్డీ రేట్లు, జియోపాలిటికల్ అంశాలు దీనికి కారణం కావచ్చు. పండగ సీజన్‌లో ధరలు మరింత పెరగొచ్చని అంచనా.

దేశంలో బంగారం ధరలు తాజాగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,15,000 పైనే ఉంది. ఇది 2020 లోని రూ.50,000 తో పోలిస్తే 140% పెరిగింది. అంటే గత ఐదేళ్ళలోనే బంగారం ధర రూ.65,000 పెరిగింది. పండుగ సీజన్‌లో డిమాండ్ పెరగడంతో ఈ పెరుగుదల మరింత వేగవంతం అవుతోంది. అంతర్జాతీయంగా అమెరికా మార్కెట్లో బంగారం ధర 3726 డాలర్లకు పైగా ఉంది. అమెరికాలోని వడ్డీ రేట్లు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి జియోపాలిటికల్ అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపుతున్నాయి. కొంతమంది నిపుణులు కొద్దికాలంలో 6% వరకు తగ్గుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే దీర్ఘకాలంలో మరింత పెరుగుదలకు అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.