Mock Drill Live Video: అలర్ట్.. మోగిన సైరన్.. ప్రారంభమైన మాక్ డ్రిల్స్.. లైవ్ వీడియో

Updated on: May 07, 2025 | 4:22 PM

దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ప్రారంభమైంది. భారత్‌-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు.. దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్స్‌ జరుగుతున్నాయి.. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్‌ చేపట్టారు. సరిగ్గా 4 గంటల నుంచి 4:30 వరకు మాక్‌ డ్రిల్ సాగనుంది.

దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ప్రారంభమైంది. భారత్‌-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు.. దేశవ్యాప్తంగా 244 ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్స్‌ జరుగుతున్నాయి.. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్‌ చేపట్టారు. సరిగ్గా 4 గంటల నుంచి 4:30 వరకు మాక్‌ డ్రిల్ సాగనుంది. ముందుగా పోలీస్‌ సైరన్‌, ఇండస్ట్రియల్‌ సైరన్ మోగాయి.. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ తోపాటు.. అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ ప్రారంభమైంది..

హైదరాబాద్ లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌, గోల్కొండ, కంచన్‌బాగ్‌ DRDA, మౌలాలిలోని NFCలో డిఫెన్స్‌ బృందాలు మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తున్నాయి. విశాఖలో రెండు చోట్ల మాక్‌ డ్రిల్స్‌ జరుగుతున్నాయి. కొత్త జాలరు పేట, ఆక్సిజన్‌ టవర్స్‌ దగ్గర మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్నారు.

Published on: May 07, 2025 03:56 PM