రోజుకు 200 లీటర్లే.. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు

Updated on: Jun 15, 2026 | 9:04 PM

దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు పెట్రోల్ బంకుల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించింది. ఇకపై రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాలి. పీఈఎస్‌ఓ అనుమతి పొందిన కంటైనర్లకే ఇంధనం అందించాలి. ఈ నిబంధనలు 90 రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి.

దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, పెద్ద కంపెనీలు ఇకపై పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర పెట్రోలియం శాఖ సంచలన ఆదేశాలు జారీ చేసింది. బల్క్ వినియోగదారులకు విక్రయించే డీజిల్ ధర సాధారణ బంకుల ధర కంటే చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు ఢిల్లీలో లీటర్ డీజిల్ బంకులో రూ. 95.20 ఉంటే, బల్క్ ధర రూ. 134.50 గా ఉంది. ఈ భారీ వ్యత్యాసం వల్ల అనేక పరిశ్రమలు డిపోలను వదిలి, బంకుల నుంచి భారీగా కొనుగోళ్లు చేస్తున్నాయి. దీనివల్ల సాధారణ వినియోగదారులకు ఇంధన కొరత వచ్చే ప్రమాదం ఉందని కేంద్రం గుర్తించింది. అంతేకాకుండా, పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరగడం కూడా ఈ నిర్ణయానికి కారణమైంది. ఇకపై ఒక వినియోగదారుడికి గానీ వాహనానికి గానీ రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాలి. ‘పీఈఎస్‌ఓ’ అనుమతి పొందిన కంటైనర్లకు మాత్రమే డీజిల్ ఇవ్వాలి. బంకుల్లో కొన్న ఇంధనాన్ని తిరిగి విక్రయించడం, నిల్వ చేయడం లేదా బ్లాక్ మార్కెటింగ్ చేయడం పూర్తిగా నిషేధం.ఈ ఆంక్షలు ప్రాథమికంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ షేర్లు కొనొచ్చా?

చ‌నిపోయిన భార్య‌పై ప్రేమ‌కు గుర్తుగా.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ

ఫేస్‌బుక్ ప్రేమ.. మూడో పెళ్లి.. కట్ చేస్తే..

పొలంలో పనులు చేసుకుంటున్న రైతు.. అకస్మాత్తుగా కనిపించిన అరుదైన దృశ్యం చూసి..

బలపడుతున్న రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల భారీ వర్ష సూచన

Follow Us