AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు.. ఈ ఊరిలో కన్నీటిని మరిపించే అద్భుతం!

వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు.. ఈ ఊరిలో కన్నీటిని మరిపించే అద్భుతం!

Phani CH
|

Updated on: Aug 16, 2026 | 4:45 PM

Share

బీహార్‌లోని గయ జిల్లాలో ఉన్న హస్రా గ్రామంలో వర్షం పడితే పొలాల్లోకి మెరిసే రంగురాళ్లు కొట్టుకొస్తాయి. హన్స్‌రాజ్ కొండ నుంచి వరద నీటితో వచ్చే ఈ రాళ్లను గ్రామస్తులు ఏరుకుని వ్యాపారులకు విక్రయిస్తారు. నాణ్యతను బట్టి ఒక్కో రాయికి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ధర లభిస్తుందని చెబుతున్నారు. పురాతన భౌగోళిక నిర్మాణం కారణంగా కొండపై ఏర్పడిన ఖనిజ రాళ్లు వర్షపు నీటితో కిందకు వస్తున్నాయని నిపుణులు తెలిపారు.

ఆకాశం నుంచి వాన చినుకులు పడితే ఎవరికైనా పంటలు పండుతాయి. కానీ, బీహార్‌లోని ఓ మారుమూల గ్రామంలో మాత్రం వర్షం వస్తే నేరుగా డబ్బులే కురుస్తాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. బీహార్‌లోని గయ జిల్లా కేంద్రానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న హస్రా గ్రామంలో ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడ సుమారు 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న హన్స్‌రాజ్ కొండ కింద ఈ వింత చోటుచేసుకుంటుంది. ప్రతి వర్షాకాలంలో ఈ కొండపై నుంచి భారీగా వరద నీరు కిందకు ప్రవహిస్తుంది. ఆ నీటితో పాటు మట్టిలో కలిసి మెరిసే రంగు రాళ్లు గ్రామస్తుల పొలాల్లోకి వచ్చి చేరుతుంటాయి. వర్షం తగ్గిన వెంటనే గ్రామస్తులంతా ఉత్సాహంగా పొలాల్లోకి వెళ్లి ఆ మెరిసే రాళ్ల కోసం వెతుకుతుంటారు. ఈ అరుదైన రంగు రాళ్లను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఎగబడుతుంటారు. నాణ్యతను బట్టి వ్యాపారులు ఈ రాళ్లను రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు భారీ ధరకు కొనుగోలు చేస్తుండటం విశేషం. ఈ అద్భుత పరిణామంపై గయా కాలేజీ భౌగోళిక శాస్త్ర నిపుణులు స్పందిస్తూ.. ఇది అత్యంత పురాతన భౌగోళిక నిర్మాణమని, కాలక్రమేణా వాతావరణ మార్పుల కారణంగా కొండపై ఉన్న ఖనిజాలు గుండ్రటి రాళ్లుగా మారుతాయని తెలిపారు. వానొచ్చినప్పుడు నీటి కోత వల్ల ఇవి కిందకు కొట్టుకొస్తాయని వివరించారు. ప్రకృతి ప్రసాదించిన ఈ అదృష్టంతో ఆ గ్రామస్తుల తలరాతే మారిపోతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్పోర్ట్స్ బ్యాగు తెరిచిన యువకుడు.. లోపలున్నది చూసి పరుగో పరుగు!

Follow Us