వందేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో బతకాలంటే ?? డాక్టర్‌ సూచన..!

Updated on: May 02, 2025 | 5:26 PM

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవాడే నిజమైన ధనవంతుడు అంటారు. ప్రతి మనిషీ ఆరోగ్యంగా ఉండాలని, వందేళ్లు సంతోషంగా బ్రతకాలని కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ఆహర నియమాలు పాటిస్తారు. వ్యాయామం చేస్తుంటారు. అయినా కొందరు రోగాలబారిన పడుతూనే ఉంటారు.

అయితే వందేళ్లకుపైగా ఆరోగ్యంగా జీవించడానికి, దీర్ఘాయుష్షుకు వ్యాయామమే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఆహార నియమాల కన్నా వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. నిపుణులు ప్రకారం, దీర్ఘాయుష్షుకు అత్యంత ముఖ్యమైన అంశం రోజువారీ శారీరక శ్రమ. ఇది కేవలం బరువు తగ్గడానికో, ఫిట్‌గా ఉండటానికో మాత్రమే కాదు, జీవన ప్రమాణాన్ని పెంచే ప్రాథమిక అవసరం అని చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సాధారణ బరువు ఉండి శారీరక శ్రమ లేని వ్యక్తి కంటే, కాస్త అధిక బరువు ఉండి కూడా రోజూ చురుగ్గా వ్యాయామం చేసే వ్యక్తి ఎక్కువ కాలం జీవించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయట. బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలున్నా, చివరికి పొగతాగే అలవాటు ఉన్నా సరే.. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు, ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా శారీరకంగా నిష్క్రియంగా ఉండే వారికన్నా ఎక్కువ ఆయుష్షు పొందగలరని చెబుతున్నారు. అలాగని జిమ్‌లో గంటలు తరబడి కఠినమైన వ్యాయామం చేయాల్సిన అవసరం లేదని, కాదు, రోజువారీ క్రమం తప్పకుండా శరీరానికి నిలకడైన కదలిక అవసరమని అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేసిన డాక్టర్లకు షాక్..

నల్ల నేరేడు కాదు..తెల్ల నేరేడు.. తింటే వదలరు..!

తండ్రికి మరిచిపోలేని గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంది..చివరికి అంతులేని శోకం మిగిల్చింది !!

అర్థరాత్రి హీరోయిన్ గదిలోకి దూరిన దొంగ !! షాక్‌తో గట్టిగా అరిచిన ముద్దుగుమ్మ