హైదరాబాద్‌లో కుండపోత వర్షం వీడియో
హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కాగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోటి ఈఎన్‌టీ ఆసుపత్రిలోకి వరద నీరు చేరి రోగులు, వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. రాజేంద్రనగర్, ఉప్పల్, మియాపూర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ట్రాఫిక్ స్తంభించడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
హైదరాబాద్ మహానగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురవడంతో ప్రధాన రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి. ముఖ్యంగా కోటి ప్రాంతంలో పరిస్థితి దారుణంగా మారింది. కోటి ఈఎన్‌టీ ఆసుపత్రి పూర్తిగా జలదిగ్బంధనంలో చిక్కుకుంది. ఆసుపత్రి వార్డులు, ఎమర్జెన్సీ సెంటర్‌లోకి వర్షపు నీరు, సమీపంలోని నాలా నుంచి వరద నీరు ప్రవేశించడంతో రోగులు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
