Heavy Rain Alert: మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన GHMC
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని ఆరు జోన్లకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయ ఘటనలు నివారించడానికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని పోలీసులు సూచించారు.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరం అంతటా ముసురు పట్టిన వాతావరణం నెలకొందని, ఆరు జోన్లకు ఎల్లో అలర్ట్ జారీ చేసిందని ప్రకటించింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అప్రమత్తం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఈ వర్షాల ప్రభావంతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టేక్ ఆఫ్, ల్యాండింగ్‌లలో ఇబ్బందుల వల్ల కొన్ని విమానాలను విజయవాడకు మళ్లించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ, జీహెచ్‌ఎంసీ హెచ్చరించాయి. ట్రాఫిక్ జామ్‌లను నివారించడానికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని పోలీసులు సూచించారు. జీహెచ్‌ఎంసీ, హైట్రా సహా ఇతర కీలక శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఘట్ కేసర్ లో ఫలక్ నామ ఎక్స్ ప్రెస్ ఆపి తనిఖీలు చేస్తున్న పోలీసులు
కర్నూలు జిల్లాలో మరింత పతనమైన టమాటా ధర
ములుగు జిల్లాలో ఉధృతంగా బొగత జలపాతం
ప్రపంచంలోని 20 హాటెస్ట్ నగరాల్లో 19 మనవే !!
మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?

