AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ సర్కార్ చేతికి హైదరాబాద్ మెట్రో

తెలంగాణ సర్కార్ చేతికి హైదరాబాద్ మెట్రో

Phani CH
|

Updated on: Sep 26, 2025 | 8:08 PM

Share

హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించింది. ఎల్ అండ్ టీ నిష్క్రమించడంతో, ఆ సంస్థకున్న ₹13,000 కోట్ల అప్పును ప్రభుత్వం భరించనుంది. ఇందులో భాగంగా ₹2,000 కోట్లు చెల్లించనుంది. ఫేజ్ 2 విస్తరణ ప్రణాళికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించింది. హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ తప్పుకోవడంతో, ఆ సంస్థకున్న ₹13,000 కోట్ల అప్పును ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తోంది. ఇందులో భాగంగా ఎల్ అండ్ టీకి ప్రాథమికంగా ₹2,000 కోట్లను ప్రభుత్వం చెల్లించనుంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ₹22,000 కోట్లతో నిర్మించిన హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర సేవలు అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఫేజ్ 2A, 2B కింద 163 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో లైన్ల ప్రతిపాదించింది. అయితే, ఫేజ్ 2 ఆమోదం కోసం ఎల్ అండ్ టీతో ఒక డెఫినిటివ్ అగ్రిమెంట్ చేయాలని కేంద్రం కోరింది. ఫేజ్ 2 లో ఈక్విటీ భాగస్వామిగా పాల్గొనలేమని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. తమ ఈక్విటీ వాటాను రాష్ట్రం లేదా కేంద్రం కొనుగోలు చేయవచ్చని సూచించింది. దీంతో, ఫేజ్ వన్ ప్రాజెక్ట్ అప్పు ₹13,000 కోట్లు తాము తీరుస్తామని ప్రభుత్వం అంగీకరించింది. మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రణాళికల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫేజ్ వన్‌ను తన ఆధీనంలోకి తీసుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సోషల్ మీడియా అనుచిత పోస్టుల పెట్టినవారిపై కఠిన చర్యలు

Donald Trump: భారత కంపెనీలపై పగబట్టిన ట్రంప్

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు CM రేవంత్ రెడ్డి సూచనలు

టాలీవుడ్ లో అగ్రనటుల మధ్య మొదలైన చిన్నపాటి యుద్ధం

నీ అభిమానం బంగారం కాను.. గోల్డ్ మొబైల్ కవర్ పై బంగారంతో కోహ్లీ ఫొటో

Follow Us